Police Constable Suspended: ప్రస్తుత కాలంలో రీల్స్ పిచ్చి బాగా ముదిరిపోయింది. సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అయ్యేందుకు కొందరు ఏ పని చేసేందుకైనా వెనకాడటం లేదు. చుట్టు పక్కల ప్రజలు ఇబ్బంది పడతారాన్న స్పృహ కూడా వారికి ఉండటం లేదు. తమ పిచ్చి పిచ్చి రీల్స్ తో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో చత్తీస్ గఢ్ లో ఓ భార్య చేసిన రీల్ దెబ్బకు.. ఏకంగా ఓ పోలీసు అధికారి సస్పెండ్ అయ్యారు .
వివరాల్లోకి వెళ్తే
చండీగఢ్ కు చెందిన జ్యోతి (Jyothi) అనే మహిళ.. నడిరోడ్డుపై రీల్స్ చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది. మార్చి 20న గురుద్వార చౌక్ (Gurudwara Chowk) కూడలి వద్ద సా. 4:30 గంటల ప్రాంతంలో ఆమె డ్యాన్స్ చేసింది. పాదాచారులు నడిచే జీబ్రా క్రాస్ పై నిలబడి వాహనాలకు అడ్డంగా నృత్యం చేసింది. ఓ గుడికి వెళ్లి వస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు జ్యోతి ఇలా చేసింది. బాగా పాపులర్ అయిన హర్యాన్వి సాంగ్ (Haryanvi Song) కు జ్యోతి డ్యాన్స్ వేయగా.. ఆమె కజిన్ పూజా తన సెల్ ఫోన్ లో ఆ దృశ్యాలను బంధించింది. వాహనాలకు అడ్డంగా ఆమె డ్యాన్ చేయడంతో ట్రాఫిక్ ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియోను జ్యోతి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది క్షణాల్లో వైరల్ గా మారింది.
चंडीगढ़: पुलिसकर्मी की पत्नी ने ज़ेबरा क्रॉसिंग पर बनाई रील, ट्रैफिक नियमों की उड़ाई धज्जियां; रोड पर लगा जाम
महिला के खिलाफ पुलिस ने FIR दर्ज की, हालांकि थाने में ही बेल दे दी गई. मामला सेक्टर-20 में गुरुद्वारा चौक के पास का है.#Chandigarh pic.twitter.com/l2j4fTYFGv
— Ishani K (@IshaniKrishnaa) March 27, 2025
ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫిర్యాదు
నడిరోడ్డుపై జ్యోతి వీడియో చేయడం.. ట్రాఫిక్ జామ్ అయినట్లు అందులో కనిపించడంతో ఈ రీల్ పై నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఈ వీడియో వైరల్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ జస్బీర్.. సెక్టార్ 34 పోలీసు స్టేషన్ లో (Sector 34 Police Station) జ్యోతిపై ఫిర్యాదు చేశారు. ట్రాఫిక్ కు ఆటంకం సృష్టించిన కారణంగా ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఏఎస్ఐ బల్జిత్ సింగ్.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా జ్యోతిపై బీఎన్ ఎస్ సెక్షన్స్ కింద 125, 292, 3(5) కేసు నమోదు చేశారు.
Also Read: SVSN Varma To Join YCP: పవన్ కు ఊహించని దెబ్బ.. వైసీపీలోకి వర్మ.. పిఠాపురంలో ఏం జరుగుతోంది?
జ్యోతి భర్త సస్పెన్షన్
ఇదిలా ఉంటే జ్యోతి భర్త అజయ్ కుంద్ (Ajay Kund).. సెక్టార్ 19 పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. అయితే జ్యోతి తన డ్యాన్స్ వీడియోను అతడి ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్టు చేయడం అతడి ఉద్యోగానికి ఎసరు తెచ్చింది. దీంతో ఉన్నతాధికారులు అతడ్ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీనిపై స్థానిక మీడియా అజయ్ కుంద్ ను ప్రశ్నించగా అతడు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. భార్య చేసే పనులకు భర్త అకౌంటబుల్ కాదు కదా అంటూ పేర్కొన్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు అజయ్ కుంద్ సస్పెన్షన్ ను స్వాగతిస్తుంటే.. మరికొందరు తప్పుబడుతున్నారు.