మేడ్చల్, స్వేచ్ఛ : Medchal Road Accident: గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాలు ప్రకారం.. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని చెక్ పోస్ట్ నుంచి కిష్టాపూర్ వెళ్లే దారిలో ఏక్ మినార్ మసీద్ వద్ద గుర్తుతెలియని వాహనం యువకుడిని ఢీ కొట్టింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Also read: Zaheerabad Crime: జెహీరాబాద్ లో దారుణం.. ఒంటరిగా ఉన్నమహిళపై దాడి.. ఆపై
మృతుడు మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని కిష్టాపూర్ లో కృష్ణ (19) గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు.