ములుగు/మహబూబాబాద్ స్వేచ్ఛ: Case Against fake maize seeds:ములుగు జిల్లాలో మల్టీ నేషనల్ మొక్కజొన్న క్రాస్ బ్రిడ్ విత్తన కంపెనీల ఆర్గనైజర్లు రైతులను అడ్డంగా ముంచి వారి కుటుంబాలను రహదారుల మీద తీసుకొచ్చారు. రాష్ట్ర రైతు కమిషన్ ఆదేశాలతో సింజంట, హైటెక్ మల్టీ నేషనల్ మొక్కజొన్న విత్తనాల ఆర్గనైజర్లు అయిన గొడవర్తి నరసింహమూర్తి, మన్యం సురేష్ బాబులతో పాాటు మరో ఇద్దరు ఆర్గనైజర్ల పైన వెంకటాపురం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయి.
ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా గొడవర్తి నరసింహమూర్తి, మన్యం సురేష్ బాబులు పరారీలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరు రాష్ట్ర హైకోర్టులో యాంటిస్పేటరీ బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే వీరిద్దరూ ఆదివాసి రైతుల నుంచి ఎన్నో రకాల ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోని దృష్టి సారించిన వెంకటాపురం పోలీసులు ఆ ఇద్దరు ఆర్గనైజర్లపై మరో నాలుగు కేసులు నమోదు చేసేందుకు విచారణ చేయబడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Telugu states: ఉగాది వేళ ఇలా జరిగిందేంటి.. ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం!