Telugu states(Image Credit: Twitter)
క్రైమ్

Telugu states: ఉగాది వేళ ఇలా జరిగిందేంటి.. ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం!

Telugu states: శుభారంభానికి ప్రతీకగా భావించే ఉగాది పండుగ రోజే కొన్ని కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. తెలుగు కొత్త సంవత్సరం సంతోషంగా ప్రారంభించాల్సిన వేళ, ఆ కుటుంబాల్లో కన్నీటి వర్షం కురిసింది. పండుగ సందడి మధ్య, ఓవైపు బంధువులతో కలిసి ఉత్సాహంగా గడపాల్సిన సమయంలో, మరికొంత మంది జీవితాల్లో ఊహించని ఘటనలు చోటుచేసుకున్నాయి. వేరువేరు ప్రాంతాల్లో ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, ఒత్తిడితో కొందరు ఆత్మహత్యకు పాల్పడగా, మరికొందరు పండుగ సందర్భంగా ప్రయాణం చేస్తూ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనలతో వారి కుటుంబాల్లోని పండుగ ఉత్సాహం క్షణాల్లో విషాదంగా మారిపోయింది. ఉగాది పండుగను కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా జరుపుకోవాలని భావించిన వారు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు.

శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణం గాంధీ బజార్ ప్రాంతంలో నివాసం ఉన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గాంధీ బజార్‌లోని ఒక ఇంట్లో నలుగురు వ్యక్తులు విగతజీవులుగా పడి ఉన్నారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా, బంగారం వ్యాపారి కృష్ణమాచారి (50), ఆయన భార్య సరళమ్మ (45), కుమారులు సంతోష్ (25), భువనేశ్ (23)లు ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.

ప్రాథమిక దర్యాప్తులో ఆర్థిక సమస్యలు కారణంగా కుటుంబం తీవ్ర మనోవేదనకు గురై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కృష్ణమాచారి బంగారం వ్యాపారం నిర్వహించేవారు. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అప్పుల భారంతో తీవ్ర ఒత్తిడికి గురైన కుటుంబ సభ్యులు సంచలన నిర్ణయం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: నడిరోడ్డుపై యువతికి ప్రశవం.. డాక్టర్లపై నెటిజన్ల ప్రశంసలు.. ఎందుకంటే?

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఎలాంటి సూసైడ్ నోట్ వదిలివేసినారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులను విచారించి మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

సైనైడ్ తీసుకున్నారా..?
విషాదాంతంగా ముగిసిన బంగారు వ్యాపారి కృష్ణమాచారి కుటుంబం ఆత్మహత్య ఘటనలో సైనైడ్ వాడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో పండగపూట సంచలనంగా మారిన బంగారు వ్యాపారి కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులుకు ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయి. ఇంటి యజమాని కృష్ణమాచారి ప్యాకెట్లో సైనేడ్ లబ్దమైనట్లు సీఐ నాగేశ్ బాబు తెలిపారు నీళ్లలో సైనేడ్ ద్రావకం కలిపి సేవించినట్లుపోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై క్లూస్ టీంను రప్పించి దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు. కాగా పెద్ద కుమారుడు సంతోష్ పదో తరగతి పరీక్షలు రాస్తూ ఓ ప్రైవేట్ స్కూల్ హాస్టల్‌లో ఉంటున్నాడు. రెండవ కుమారుడు భువనేశ్(13) 9వ తరగతి ఇద్దరు కుమారులు పండుగ కోసం హాస్టల్ నుండి ఇంటికి వచ్చారు. ఆర్థిక కారణాలతోపాటు, కుటుంబ కలహాల పైన దృష్టి సారించినట్లు ట్రైనీ డీఎస్పీ ఉదయపావని తెలిపారు.

మెహందీ ఆర్టిస్ట్ ఆత్మహత్య..
హైదరాబాద్‌ నగరంలోని అత్తాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా మెహందీ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న పింకీ(37) ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పింకీ ఫేమస్ మెహందీ ఆర్టిస్ట్, ఆమె తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. విషయాన్ని స్థానికులకు తెలియజేయడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..
ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ రోజు తెల్లవారు జామున వైజాగ్ నుంచి ఖమ్మం వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు కండక్టర్ అక్కడికక్కడే మరణించాడు. మరో ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్