Odisha Train Accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి గువాహటి వెళ్తున్న కామాఖ్యా ఎక్స్‌ప్రెస్ (12251) రైలు 11 బోగీలు పట్టాలు తిప్పాయి. కటక్ సమీపంలోని నేరగుండి స్టేషన్ (ఖుర్దా డివిజన్) వద్ద జరిగింది.
రైల్వే అధికారుల ప్రకారం.. రైలు నేరగుండి స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో రైలులో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. పట్టాలు తప్పిన 11 బోగీలు మొత్తం ఏసీ కోచ్‌లు అని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు మృతి చెందగా, కొందరు ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సీపీఆర్‌ఓ అశోక్ కుమార్ మిశ్రా ప్రకటించారు.
Also Read: సైబర్ కిలాడీ అరెస్ట్.. ఎలా అరెస్ట్ చేశారంటే?
ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు, సహాయ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. రైల్వే ఉన్నతాధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నారు. రైలు పట్టాలు తప్పటానికి గల కారణాలను తెలుసుకునేందుకు రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.