విజయవాడ, స్వేచ్ఛ: Venkaiah Naidu: ఓట్ల కోసం అన్నీ ఫ్రీ.. ఫ్రీ అంటూ ప్రజలను లీడర్లు ఆకట్టుకుంటున్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదని సూచించారు. శనివారం విజయవాడలో ఒకే దేశం- ఒకే ఎన్నిక సదస్సులో ఆయన మాట్లాడుతూ ముందుగా తెలుగు ప్రజలదరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ‘ దేశ వ్యాప్తంగా వన్ నేషన్- వన్ ఎలక్షన్‌పై చర్చ జరుగుతోంది. పదవి విరమణ చేశా కానీ పెదవి విరమణ చేయలేదు. ప్రజల ఆకాంక్ష మేరకు నాకు నచ్చిన అభిప్రాయాలను యువతరానికి తెలియచేస్తాను.
ఒకే దేశం ఒకే ఎన్నికలు సమర్థవంతంగా జరగాలి. కొందరు వ్యతిరేకించేవారు కూడా ఉంటారు. వాటి మీద అవగాహనకు రావాలి. లోక్‌సభకు, శాసన సభకు ఒకేసారి ఎన్నికలు జరగాలి. ఇది కొత్త కోరిక కాదు, మోదీ నిర్ణయమూ కాదు. 1952లో సాధారణ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 1957, 1962, 1967లో ఇలా ఒకేసారి జరిగాయి. ఇందిరా గాంధీ, నెహ్రులు ప్రధాని ఉన్నప్పుడు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది’ అని వెంకయ్య గుర్తు చేశారు.
దారి తప్పాయి కాబట్టే..
‘ 1985లో రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరొకసారి ఎన్నికలకు వెళ్దాం అన్నారు. ఇందిరా హత్య అనంతరం కాంగ్రెస్ ఎన్నికల్లోకి వెళ్లాయి. రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అలాగే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సమర్థవంతంగా పరిపాలించే వారికీ తప్పకుండా ప్రజలు నిలబడతారు. అంతేకానీ, ఈ జమిలి వస్తే బీజేపీకి అనుకూలంగా ఉంటద
ని కొన్ని పార్టీలు అపోహ పడుతున్నాయి. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే సమైఖ్య స్ఫూర్తి దెబ్బ తీస్తుంది, ప్రాంతీయ పార్టీలు నష్టపోతాయనడంలో పస లేదు.
Also read: CM Chandrababu: చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్.. తెగ వైరల్ చేస్తున్న క్యాడర్..
అసెంబ్లీలు రద్దు చేయటంలో మధ్యలో ఎన్నికలు నిర్వహించడంతో ఒకే దేశం ఒకే ఎన్నికలు దారి తప్పాయి. అందుకే తిరిగి దేశం అభివృద్ధి చెందటంలో ప్రముఖ పాత్ర వహించే వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరగాలి. నిరంతరం ఎన్నికలు జరుగుతుంటే మంచి పాలన ఉండదు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశ భవిష్యత్తును ముందుకి తీసుకెళ్ళేది, అభివృద్ధిని వేగవంతం చేసేది. ఖర్చు తగ్గుతుంది మ్యాన్ పవర్ సర్దుబాటు జరుగుతుంది. పాలన కూడా సజావుగా కొనసాగుతుంది. సంక్షేమం, అభివృద్ధి సమానంగా రాష్ట్రాలు ప్రజలకు సుపరిపాలన అందించగలదు. ఏదొక రాష్ట్రాలు ఎలక్షన్ మోడ్‌లో ఉంటే ప్రజాపాలనకు ఆటంకాలు ఏర్పడతాయి. వన్ నేషన్- వన్ ఎలక్షన్‌తో పాటు పార్టీ ఫిరాయింపులపై కూడా కఠినమైన చట్టాలు తీసుకురావాలి’ అని వెంకయ్య వెల్లడించారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/