CM Chandrababu (image credit:Twitter)
ఆంధ్రప్రదేశ్

CM Chandrababu: చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్.. తెగ వైరల్ చేస్తున్న క్యాడర్..

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకు చంద్రబాబు ట్వీట్ లో ఏముందంటే?

శనివారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 43 ఏళ్లుగా తమ పార్టీని గుండెల్లో పెట్టుకున్న పార్టీ నాయకులకు కార్యకర్తలకు సీఎం చంద్రబాబు, జాతీయ అధ్యక్షుడి హోదాలో కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు ట్వీట్ ఆధారంగా.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు.

43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ చంద్రబాబు అన్నారు. అన్న నందమూరి తారక రామారావు ఆశీస్సులతో, సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ ప్రతి విజయానికి కార్యకర్తల తిరుగులేని పోరాటం, త్యాగగుణం, నిబద్ధత తోడున్నాయన్నారు.

పీకపై కత్తిపెట్టినా, జై తెలుగుదేశం నినాదం తప్ప వేరే మాట వినిపించని గొంతుక ఉండే కార్యకర్తలు గల ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ కార్యకర్తలను చంద్రబాబు కొనియాడారు. ఆత్మగౌరవాన్ని కాపాడుతూ అభివృద్ధి పథాన నడిపించిన జెండా తెలుగుదేశం పార్టీ జెండా అన్నారు. రైతన్నల కన్నీరు తుడిచి, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తెచ్చిన జెండా పసుపు జెండా అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

దేశంలో మరే రాజకీయ పార్టీ కూడా తెలుగుదేశం స్థాయిలో ప్రజల జీవితాలను ప్రభావితం చేయలేదని, తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు.. ఆ తరువాత అంటూ ప్రతి ఒక్కరు గుర్తించే పరిస్థితి ప్రస్తుతం ఉందన్నారు. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే కాకుండా, ప్రజా సంక్షేమానికి పాటుపడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ చంద్రబాబు అన్నారు.

Also Read: Chandrababu – Pawan: చంద్రబాబుకు 14, పవన్ కు 73.. ఇంతకు ఇవేమిటంటే?

కోటికి పైగా సభ్యత్వాలతో అసాధారణ రికార్డును సృష్టించి, తెలుగువారి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ప్రతి పార్టీ నాయకుడికి, కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఎప్పటికీ ప్రజా సేవకు పునరం కితం అవుతామని జై తెలుగుదేశం.. జోహార్ ఎన్టీఆర్ అంటూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున సీఎం చంద్రబాబు ట్వీట్ చేయగా, క్షణాల వ్యవధిలో అధిక సంఖ్యలో వ్యూస్ ను ఆ ట్వీట్ సాధించింది.

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!