Etela Rajender
Politics

Phone Tapping: నా ఫోన్, నా భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారు: ఈటల

Eatala Rajender: మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఫోన్ ట్యాపింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని అన్నారు. తన ఫోన్, తన భార్య, తన కొడుకు-కోడలి ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. అంతేకాదు, తన డ్రైవర్, తమ ఇంటిలో పని మనిషి ఫోన్ కూడా ట్యాప్ చేశారని పేర్కొన్నారు. తనదే కాదు.. చాలా మంది వ్యక్తిగత జీవితాల్లోకి ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రవేశించారని, ఎన్నో సంసారాల్లోకి తొంగి చూశారని పేర్కొన్నారు. తనను ఇలా ఫోన్ ట్యాపింగ్, ఇతర విధాల అష్టదిగ్బంధనం చేస్తేనే కదా. . ప్రస్తుతం ఇక్కడికి వచ్చానంటూ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు ముమ్మరమైన తర్వాత చాలా మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. పలువురు నాయకులు, ప్రముఖులు తమ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని వివరించారు.

40 మంది మహిళలపై కానిస్టేబుల్ లైంగిక వేధింపులు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఈ ఫోన్ ట్యాపింగ్‌ను రాజకీయ ప్రత్యర్థుల కదలికలను పసిగట్టడానికి, ప్రముఖులను బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి వాడినట్టు ఇది వరకు దర్యాప్తులో తెలిసింది. తాజాగా ఈ ఫోన్ ట్యాపింగ్‌ను ప్రైవేటు వ్యక్తుల సంసారాల్లోకి చొరబడటానికి కూడా వినియోగించినట్టు బయటపడింది. నల్లగొండకు చెందిన ఓ కానిస్టేబుల్ ఫోన్ ట్యాప్ చేసి మహిళలపై లైంగిక వేధింపులకు దిగాడని తెలిసింది.

Also Read: పోసాని, అలీ ఎక్కడా? జగన్ మర్చిపోయారా?

ఫోన్ ట్యాపింగ్ ద్వారా మహిళల వ్యక్తిగత వివరాలు తెలుసుకుని, వారి వ్యక్తిగత జీవితాలతో ఓ కానిస్టేబుల్ ఆడుకున్నాడని పోలీసుల విచారణలో బయటపడింది. అప్పటి జిల్లా బాస్‌తో సదరు పోలీసు కానిస్టేబుల్‌కు దగ్గరి సంబంధాలు ఉండేవని, అందుకే ఆయన ఆడిందే ఆట పాడిందే పాట అయిందని తెలిసింది.

జిల్లాలో రౌడీ షీటర్లతో సెటిల్ మెంట్లు చేయించి గుర్రంపోడ్ వద్ద ఓ పోలీసు అధికారి బినామీల పేరిట 9 ఎకరాల తోట కొన్నాడని విచారణలో తేలింది. నార్కట్‌పల్లిలో గంజాయి కేసులో దొరికిన నిందితుల వ్యక్తిగత జీవితాల్లోకి ఈ కానిస్టేబుల్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రవేశించాడని తెలిసింది. సుమారు 40 మంది మహిళలపై లైంగిక వేధింపులకు దిగాడని సమాచారం.

Also Read: ఇక రాజకీయ నాయకుల విచారణ? త్వరలో ఓ ఎమ్మెల్సీకి నోటీసులు!

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది వరకే ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లను విచారించారు. తాజాగా, నల్లగొండ నుంచి మరో కానిస్టేబుల్ అదుపులోకి తీసుకుని విచారించారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?