MLC: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొత్త మలుపు తిరగనున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటి వరకు ఈ కేసు పోలీసు అధికారుల చుట్టే తిరిగింది. ఇక పై ఇది రాజకీయ నాయకుల మెడకు చుట్టుకునేలా ఉన్నది. తొలిసారిగా ఈ కేసులో ఓ రాజకీయ నాయకుడికి నోటీసులు పంపే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజో లేక రేపో ఒక ఎమ్మెల్సీకి ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు నోటీసులు పంపించినున్నట్టు తెలిసింది.
ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి అధునాతన పరికరాలను కొనుగోలు చేసి వినియోగించినట్టు దర్యాప్తులో తేలింది. ఫోన్ ట్యాప్ చేయాలనుకున్నవారికి 300 మీటర్ల దూరంలో నుంచి ఈ పరికరాలు తమ పని చేసే సామర్థ్యం గలవనీ అధికారులు పేర్కొన్నారు. ఇంకా ఏ సాఫ్ట్‌వేర్ వాడారో అనే విషయం తెలియదు. ఈ పరికరాలను విదేశాల నుంచి కొనుగోలు చేయడానికి ఎవరు నిధులు సమకూర్చారనేదీ తెలియరాలేదు.
Also Read: ఆర్జీవీ డైలాగ్ కాపీ కొడుతున్న తెలుగు ముఖ్యమంత్రులు జగన్, రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్‌కు అవసరమైన పరికరాలను కొనుగోలు చేయడానికి ఓ రాజకీయ నాయకుడు నిధులు సమకూర్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు వేగం చేయనున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే పోలీసులు నగరంలోని ఓ ఎమ్మెల్సీకి నేడో, రేపో నోటీసులు పంపించనున్నట్టు తెలిసింది. ఆయనను విచారిస్తే మరికొందరు రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు.. త్వరలో మరో 25 మంది?
ఈ కేసులో మాజీ అదనపు డీఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. వీరిని విచారిస్తున్న సమయంలో హైదరాబాద్‌కు చెందిన ఓ ఎమ్మెల్సీ పేరును వారు ప్రస్తావించినట్టు తెలిసింది. వారి ఇచ్చిన సమాచారం ఆధారంగానే సదరు ఎమ్మెల్సీకి నోటీసులు పంపనున్నట్టు చెబుతున్నారు.