తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Unique Disability ID Cards: హైదరాబాద్ జిల్లాలోని వికలాంగులు, మానసిక వికలాంగులకు యూనిక్ డిజిబులిటీ ఐడీ కార్డులను జారీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలను డీఆర్వో ఈ వెంకటాచారి తో కలసి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించారు. ముందుగా ఆస్పత్రిలోని సదరం కేంద్రాన్ని పరిశీలించి కేంద్రంలో సత్వరమే మౌలిక వసతులు కల్పించి అందుబాటులోకి తేవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కేంద్రం ఇకపై యూడీఐడీ కేంద్రంగా పని చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూడీఐడీ సర్టిఫికెట్లు, జారీ చేయుటకై హైదరాబాద్ జిల్లాకు ఐదు ఆసుపత్రులు ప్రభుత్వం కేటాయించిందని అందులో ఉస్మానియా ఆసుపత్రి ఆర్థోపెటిక్, సరోజినీ ఆసుపత్రి అంధులకు, కోఠి ఈఎన్టీ ఆసుపత్రి చెవిటి మూగవారికి, నీలోఫర్ ఆసుపత్రి పిల్లలకు అలాగే మానసిక రోగులకు ఎర్రగడ్డ ఆసుపత్రులు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారికి అర్హత మేరకు సర్టిఫికెట్స్, కార్డులు అందించుటకు అందుబాటులో ఉంటాయని అన్నారు.
Also Read: Supreme Court: మిస్ లీడ్ యాడ్స్ తో మోసపోయారా.. ఇక వాటికి చెక్!
జిల్లాలోని వివిధ సమస్యలతో ఉన్నవారు ఆన్ లైన్ లో డీఐడీ ఫోల్డర్ లో పూర్తి వివరాలు నమోదు చేసుకొని తదుపరి సమాచారంతర్వాత సంబంధిత ఆసుపత్రులకు వెళ్లి వైద్యులచే పరీక్షలు చేయించుకున్న తర్వాత అర్హత ఉంటే సర్టిఫికెట్, కార్డు అందుతాయని అన్నారు. ఆసుపత్రి పరిశీలనలో భాగంగా ఔట్ పేషెంట్, ఇన్ పేషంట్ అలాగే అందుతున్న వైద్య సేవలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పేషంట్స్ వెయిటింగ్ హాల్లో త్రాగునీరుతో పాటు సీలింగ్ ఫ్యాన్స్ ఏర్పాటు చేయాలని, ఆసుపత్రికి వచ్చే మానసిక రోగులకు మెరుగైన వైద్య సేవలు అందాలని కోరారు.
ఈ సందర్భంగా వైద్య అధికారులకు ఆదేశించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆస్పత్రిలో నీటి సంపు, అంతర్గత రోడ్లు చేపట్టాలని కోరగా సంబంధిత ప్రతిపాదనలు వెంటనే పంపాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఆసుపత్రి సూపరిండెంట్ ఆర్ అనిత, తహసిల్దార్ పద్మ సుందరి, వివిధ విభాగాల వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Telangana Govt: త్వరలో భారీ బదిలీలు.. ఆ 60 మంది అధికారులు?