తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Banjara Hills police: సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకోవటానికి ఓపెన్ టాప్ జీపులో తిరుగుతూ ఎయిర్ రైఫిల్ తో హంగామా చేసిన యువకున్ని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి ఎయిర్ రైఫిల్ తోపాటు జీపును స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 26న అర్ధరాత్రి దాటిన తరువాత కొందరు యువకులు ఓపెన్ టాప్ జీపులో పరిమితికి మించి వేగంతో బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1లో వీరంగం సృష్టించారు.
Also Read: Duvvada Srinivas: మాధురి ఇంటికి.. కరెంట్ కట్.. అంతు చూస్తానంటున్న దువ్వాడ
యువకుల్లో ఒకడు సర్వీ హోటల్ వద్ద గాల్లో రైఫిల్ ను తిప్పుతూ పెద్ద పెద్దగా కేకలు పెట్టాడు. ఇది గమనించిన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రీకాంత్ ఫిర్యాదు చేశాడు. కేసులు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా జీపు నెంబర్ ను సేకరించారు. ఈ క్రమంలో జీపు సనత్ నగర్ కు చెందిన అఫీజుద్దీన్ (21)దని గుర్తించి అతనితోపాటు డ్రైవర్ ను కూడా అరెస్ట్ చేశారు. వృత్తిరీత్యా వీడియో గ్రాఫర్ అయిన రీల్ కోసమే ఇలా చేసినట్టు విచారణలో వెల్లడైంది.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు