కాటారం, స్వేచ్ఛ: Tiger Spotted Roaming: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఒడిపిలవంచ ఎర్రచెరువు వద్ద పులిని చూసినట్టు స్తానికులు చెబుతున్నారు. దాహార్తి తీర్చుకోవడానికి చెరువు వద్దకు పులి వచ్చిందని గ్రామస్తులు అంటున్నారు. అటవీ ప్రాంతంలో వంటచెరుకు కోసం వెళ్తున్న స్థానికులు పులిని చూసి కేకలు వేయడంతో టైగర్ అడవిలోకి వెళ్ళిపోయింది.
పులి ఫారెస్ట్ అధికారులు పాదముద్రల ఆనవాళ్లు గుర్తించారు. గత నెలన్నరగా కాటారం, మహదేవపూర్ రేంజ్ పరిధిలో సంచరించిన మగ పులితో సమీప గ్రామల ప్రజలు భయాందోళనలో బిక్కు బిక్కుమంటూ గ్రామస్తులు భయాందోళనలో గడుపుతున్నారు.
Also read: 15-foot Snake: పొలాల్లో రైతులు.. చూసేందుకు వచ్చిన బిగ్ స్నేక్.. ఆ తర్వాత?
అటవీప్రాంతంలోకి వెళ్లొద్దంటూ అటవీశాఖ అధికారులు, హెచ్చరోజులు జారి చేస్తున్నారు.