Duvvada Srinivas
ఆంధ్రప్రదేశ్

Duvvada Srinivas: మాధురి ఇంటికి.. కరెంట్ కట్.. అంతు చూస్తానంటున్న దువ్వాడ

Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas).. కుటుంబ కథా చిత్రం గత కొన్నిరోజులుగా ఏపీలో చర్చకు వస్తూనే ఉంది. భార్య వాణితో విడాకుల కోసం కోర్టుకు వెళ్లిన దువ్వాడ.. దివ్వెల మాధురితో ప్రస్తుతం కలిసి జీవిస్తున్నారు. ఎక్కడా చూసిన ఇద్దరూ జంటగా దర్శనిమిస్తున్నారు. పలు మీడియా సంస్థలకు సైతం నవ ప్రేమికులు తరహాలో ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నారు. సమాజం ఏమనుకున్న తనకు పర్లేదని.. మాధురితో కలిసి జీవించడమే తన లక్ష్యమని పలు ఇంటర్వ్యూల్లో దువ్వాడ శ్రీనివాస్ తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా మాధురికి ఓ కష్టం రాగా.. దువ్వాడ శ్రీనివాస్ శివాలెత్తిపోయారు.

ఏం జరిగిందంటే?
సోషల్ ఇన్ ఫ్లూయెన్సర్ దివ్వెల మాధురికి (Divvela Madhuri) తాజాగా అనుకోని కష్టం వచ్చి పడింది. విద్యుత్ శాఖ అధికారులు ఆమె ఇంటికి కరెంట్ కనెక్షన్ ను కట్ (Power Cut) చేశారు. దీంతో దివ్వెల మాధురి ఇంట్లో చీకట్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు మాధురి చెప్పగా ఆయన కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే ఆమె ఇంటి పరిధిలోని ఏఈ (AE)కి కాల్ చేసి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Also Read: Alluri Sitharama Raju District: ఓ వైపు అంతిమ యాత్ర.. మరోవైపు పరుగులు.. అసలేం జరిగిందంటే?

‘ఎవరితో పెట్టుకుంటున్నావ్’
విద్యుత్ అధికారైన ఏఈకి ఫోన్ చేసిన దువ్వాడ శ్రీనివాస్ ఓ రేంజ్ లో ఆయనపై ఫైర్ అయ్యారు. ఓ ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి కరెంట్ కట్ చేయడానికి నీకెంత ధైర్యం అంటూ మండిపడ్డారు. బిల్లు పెండింగ్ ఉన్న 50 కరెంట్ కనెక్షన్స్ లిస్ట్ ఇస్తాను.. దమ్ముంటే అవి కట్ చేయ్ చూస్తాను అంటూ సవాలు విసిరారు. ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిల్లు కట్టిన తర్వాత ఎలా కరెంట్ కట్ చేస్తావంటూ ఏఈని నిలదీశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ కా మారింది.

Also Read This: Viral Video: ఇతని క్రియోటివిటి చూస్తే క్రికెటర్లు కూడా సెల్యూట్ చేయాల్సిందే..!

మాధురి-దువ్వాడ పరిచయం
మాధురి ఒక డ్యాన్సర్ కాగా.. ఆమెను తన భార్య వాణినే పరిచయం చేసిందని ఓ ఇంటర్వూలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్  (Duvvada Srinivas) స్పష్టం చేశారు. అప్పట్లో తమ మధ్య ఏమి లేకపోయినా లేనిపోనివి తన భార్య అంటగట్టిందని చెప్పుకొచ్చారు. ఓ దశలో కుటుంబ వల్ల చనిపోబోయానని.. ఈ క్రమంలో మాధురి తనకు అండగా నిలిచిందని చెప్పారు. అలా తామిద్దరం దగ్గరైనట్లు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివరించారు. తన భార్యకు విడాకులు ఇచ్చి చట్టపరంగా మాధురితో జీవితాన్ని పంచుకోవాలని దువ్వాడ భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Railway Jobs: రైల్వేలో 9 వేల ఉద్యోగాలు.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!

15-foot Snake: పొలాల్లో రైతులు.. చూసేందుకు వచ్చిన బిగ్ స్నేక్.. ఆ తర్వాత?

Just In

01

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?