Akula Neelima
క్రైమ్

Akula Neelima: చిట్టీల డబ్బుల వివాదం? బిజెపి నాయకురాలిపై ఆరోపణలు?

నిజామాబాద్ స్వేచ్చ: Akula Neelima: మనం తరచూ డబ్బులు చిట్టీల పేరుతో లేదా స్కీమ్ లు, వివిధ రకాలుగా డబ్బులు దందుకొని మోసం చేసే వారిని చూసిఉంటాము. కానీ నిజామాబాద్ లో సొంత బంధువులను వివిధ అవసరాల నేపథ్యంలో నమ్మిచ్చి ఒకటికి రెండింతలు ఇస్తానని రూ.కోటి వసూలు చేసి చివరికి చేతులేత్తెసింది బీజేపీ నాయకురాలు ఆకుల నీలిమ. దీంతో బాధితులు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడికి గురువారం ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని పూసలగల్లీకి చెందిన ఆకుల నీలిమ, వినయ్ కుమార్ దంపతులు కొంతకాలంగా తమ బంధువులను నమ్మిస్తూ మచ్చిక చేసుకున్నారు.

తమ వద్ద డిపాజిట్ రూపంలో డబ్బులు పెట్టుబడిగా పెడితే వాటిని రెట్టింపు చేస్తామని మహిళలను నీలిమ నమ్మించింది. దీంతో 30 మంది మహిళలు సుమారు రూ.కోటి వరకు నీలిమకు అప్ప జెప్పారు. అయితే డబ్బుకు ఇచ్చే విషయంలో ఒక మహిళ భర్త డబ్బుకు ఇచ్చేది ఉంది కదా ఎప్పుడు ఇస్తావో త్వరగా ఇవ్వండి అని చెప్పాడు. సరే అని చెప్పిన డేట్, ఆ సమయానికి మళ్ళీ కాల్ చేసి అడిగితే సరే ఇస్తాను అంటూనే వారిపై రెండవ టౌన్ లో అరాస్ మెంట్ చేస్తున్నారని బాధితులపైనే ఫిర్యాదు చేయడం తో ఒక్క సారిగా కంగుతిన్నారు.

దీంతో ఒకరిని ఒకరు తెలీకుండా బంధువులు అందరి వద్ద కలిపి కోటి రూపాయల వరకు వసూలు చేసి టోకరా వేసింది. ఇటీవల తమ డబ్బులు ఇవ్వాలని మహిళలు అడుగగా, తన వద్ద ప్రస్తుతం డబ్బులు లేవని నీలిమ చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు. అలాగే బాధిత మహిళలందరూ నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారికి గురువారం ఫిర్యాదు చేశారు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని వేడుకుంటున్నారు. చుట్టపు చూపుతో నట్టేట ముంచిన విషయం గ్రహించలేక పోయామని బందువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Sangareddy News: ముగ్గురు బిడ్డలు మృత్యు ఒడిలోకి.. ఆ తల్లి కోమాలోకి.. అసలేం జరిగిందంటే?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!