Proddatur news: చిన్న వయస్సులోనే ప్రేమలు, ఆకర్షణలు అనే మాటలు ఇటీవల మనం విన్నాం.. స్కూల్ ఏజ్‌లోనే ప్రేమ అంటూ వెంటబడిన ఘటనలూ మనం చూశాం.. అయితే, చదువుకునే వయస్సులో ప్రేమబాట పట్టిన విద్యార్థులు మంచిచెడులు తెలియక వారు చేసే పనులతో కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో అన్నీ మన అరచేతిలో కనిపిస్తుండటంతో చెడుకు ఆకర్షితులై చేయకూడని పనులు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కడప జిల్లాలోని ఓ పాఠశాలలో అసాధారణ ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ బాలుడు తనను ప్రేమించాలని అదే పాఠశాలకు చెందిన విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్నాడు. అందుకు అతడు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 32ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీలను సృష్టించడం కళకళం రేపుతోంది. కానీ ఈ కథలో ట్విస్ట్ ఏమిటంటే అతని వెనుక తల్లిదండ్రులు, ఓ కౌన్సిలర్ సైతం ఉన్నారని ఆరోపణలు రావడం!
ఈ ఘటనలో బాలుడు తన సహచర బాలికలపై సామాజిక మాధ్యమాల ద్వారా అసభ్యకరమైన మెస్సేజ్‌లు పంపుతూ వేధించాడు. ‘నన్ను ప్రేమించకపోతే మీ వ్యక్తిగత సమాచారాన్ని అందరికీ పంపిస్తాను’ అంటూ బెదిరింపులకు దిగాడు. ఈ విషయం బాలుడి తల్లిదండ్రులకు తెలిసినప్పటికీ, వారు అతన్ని అడ్డుకోవడం మానేసి, బాధిత బాలికలను కౌన్సిలర్ సాయంతో బెదిరించేందుకు ప్రయత్నించారని బాలికల తల్లిదండ్రులు ఆరోపించారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ బాలుడు 32 ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీల ద్వారా సహ విద్యార్థినులను వేధించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తనను ప్రేమించాలని, లేకపోతే వారి వ్యక్తిగత ఫోన్ నంబర్లు, ఫొటోలు, వీడియోలను బహిర్గతం చేస్తానని బాలికలను బెదిరించాడు. ఆశ్చర్యకరంగా అతని తల్లిదండ్రులు మందలించకపోగా ప్రోత్సహించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
Also Read : మెట్రో స్టేషన్ వద్ద డ్రగ్స్ విక్రయాలు.. స్కెచ్ వేసి మరీ పోలీసుల దాడులు..
ఈ విషయం వెలుగులోకి రావడంతో బాధితుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారి ఫిర్యాదు మేరకు మైనర్ బాలుడు, అతని తల్లిదండ్రులు, కౌన్సిలర్‌తో కలిపి నలుగురిపై ప్రొద్దుటూరు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.