నర్సంపేట, స్వేచ్ఛ: CPI Panjala Ramesh:పేదలకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పంజాల రమేష్ కోరారు. గురువారం నర్సంపేట ఆర్డీవో ఉమారాణి చిత్రపటంతో దీక్షలో కూర్చున్న అంబేద్కర్ నగరం గరీబ్ బస్తి వాసులు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. నర్సంపేట టౌన్ లోని వరంగల్ రోడ్డు సర్వే నెంబర్ 813లో అంబేద్కర్ నగర్ గరీబ్ బస్తీలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గుడిసెలు వేసి నాలుగు సంవత్సరాలు కావస్తుందన్నారు. ఇప్పటివరకు కరెంటు సౌకర్యం లేదు.
ఇండ్లకు ఇంటి నెంబర్లు ఇవ్వాలని కోరారు. నీళ్ల సౌకర్యం కల్పించాలని తెలిపారు. ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని అన్నారు. బస్తిలో ఎండకు ఎండుతూ,వానకుతడుస్తూ, చలికి తట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని అన్నారు.
Jayaprakash Narayan: అవినీతికి చెక్ పెట్టిన పౌరులు.. తెగ పొగిడిన రిటైర్డ్ ఐఏఎస్..
235 గుడిశవాసులు అనేక ఆటుపోట్లకు గురవుతున్నామన్నారు. క్రిమి కీటకాలకు తట్టుకుంటూ కుటుంబ పోషణ చేసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వం అధికారులు మమ్మలను గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళ్ళే పెళ్లి ప్రణయ దీప్, రమేష్, అంది రవి, మాలతీ, లత, రవి, విమల, విజయ, సమ్మక్క, సరోజ న, విజయ, సుధారాణి, స్వరూప, నిర్మల, బూపమ్మ, వనజ, రామకృష్ణ, నాగలక్ష్మి, రాజు, రాజమణి, చక్రపాణి, వేణు, సుధాకర్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు