ములుగు/మహబూబాబాద్ స్వేచ్ఛ: Sudibaka village: సింజంట మల్టీ నేషనల్ కంపెనీ వెంకటాపురం మండల ఆర్గనైజర్ గొడవర్తి నరసింహమూర్తి పై సుడిబాక గ్రామ అలెం కృష్ణార్జునరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంకటాపురం మండలం సుడిబాక గ్రామానికి చెందిన రైతు కృష్ణార్జున రావు సింజంట కంపెనీకి చెందిన ఆర్గనైజర్ మాయమాటలు చెప్పి బాండ్ మొక్కజొన్న పంట సేద్యం చేయించాడని ఎస్సై తిరుపతిరావుకు కంప్లైంట్ ఇచ్చారు.
బాండ్ వ్యవసాయం అగ్రిమెంటులో భాగంగా రైతుకు రూ.50,000 వేలు సెప్టెంబర్లో, రూ.10000 అక్టోబర్లో, రూ.10000 వేలు నవంబర్లో, రూ.10000 నవంబర్లో, రూ.10000 డిసెంబర్లో, రూ.25000 జనవరిలో ఆర్గనైజర్ నరసింహమూర్తి బాండ్ వ్యవసాయ రైతు కృష్ణార్జునారావుకు నగదు పూర్వకంగా ఇచ్చాడు. అయితే రూ.1,05,000 సెప్టెంబర్ లోనే ఇచ్చినట్లు దొంగ లెక్కలు చెప్పినట్లు రైతు ఆపోతున్నాడు. అదేవిధంగా పురుగు మందులు, రసాయనిక ఎరువులు, విత్తనాలతో కలిపి మరో రూ.1,45,000 జమ చేసి మొత్తం రూ.2 లక్షల 50 అప్పు ఉన్నట్లు రైతుపై ఖాతా బుక్ లో రాసి బలవంతంగా అప్పు మోపాడని రైతు కృష్ణార్జున రావు ఆరోపిస్తున్నాడు.
రైతును మాయమాటలతో మోసగించిన వైనంపై కేసు
ఆదివాసి అమాయక రైతు కృష్ణార్జునరావును మాయ మాటలతో మోసగించిన సింజంట మొక్కజొన్న విత్తన కంపెనీ ఆర్గనైజర్ నరసింహమూర్తి పై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా అగ్రిమెంట్ సమయంలో ఒక్కో ఎకరానికి మూడు నుంచి నాలుగు టన్నుల మొక్కజొన్న దిగుబడి వస్తుందని చెప్పిన ఆర్గనైజర్ నరసింహమూర్తి రైతుగా వివరించాడు. అలా దిగుబడి రాకపోతే ఒక్కో ఎకరానికి రూ.9,5000 పరిహారం కట్టిస్తానని నమ్మబలికాడు. తీరా పంట చేతుకొచ్చాక రైతుకు సరైన దిగుబడి రాకపోవడంతో పరిహారం చెల్లించాలని నరసింహమూర్తిని వేడుకున్నాడు. దీంతో ముఖం చాటేసిన నరసింహమూర్తి పరిహారం చెల్లించకుండా కాలయాపన చేస్తున్నాడు.
Also Read: Gaddam Prasad Kumar: హరితహారం కార్యక్రమంపై స్పీకర్ మాస్ ర్యాగింగ్.. దెబ్బకు బీఆర్ఎస్ సైలెంట్!
అదేవిధంగా సింజంట మొక్కజొన్న విత్తన కంపెనీలతో సేద్యం చేసిన రైతుల వ్యవసాయ క్షేత్రాలను కృష్ణార్జునరావు ట్రాక్టర్ తో దున్నాలని సూచించాడు. నరసింహమూర్తి సూచనతో దాదాపు రూ.50 వేల విలువైన దుక్కులను దున్నాడు. ఈ డబ్బులను సైతం రైతుకృష్ణార్జునరావుకు తెలియకుండా ఆర్గనైజర్ నరసింహమూర్తి రైతుల వద్ద నుండి రికవరీ చేసుకున్నాడు. రైతులకు దుక్కులు దున్నిన డబ్బులు ఏమయ్యాయని నరసింహమూర్తిని అడిగితే సరైన సమాధానం లేదు. దీంతో విసిగి వేసారిన రైతు కృష్ణార్జున రావు బుధవారం వెంకటాపురం పోలీస్స్టేషన్లో నరసింహమూర్తి పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వ్యవసాయ కమిషన్ ఆదేశాలతో ఇద్దరిపై.. రైతు ఫిర్యాదుతో మరొకరిపై
మంగళవారం ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మల్టీ నేషనల్ మొక్కజొన్న విత్తన కంపెనీల ఆర్గనైజర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, అన్ని కంపెనీల రిప్రజెంటీటివ్స్, రైతులతో కలిసి రైతులకు వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ఆధ్వర్యంలో పరిహారం ఇప్పించేందుకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే యోగితాపురం గ్రామానికి చెందిన పాయం రాంబాబు చేత వ్యవసాయం చేసేందుకు హైటెక్ కంపెనీ విత్తనాలను ఆర్గనైజర్ మన్యం సురేష్ అంటగట్టాడు.
అదేవిధంగా వాజేడు మండలం పూనూరు గ్రామానికి చెందిన జాడీ రాంబాబు అనే రైతు 9 ఎకరాల్లో బేయర్ కంపెనీకి చెందిన ఆర్గనైజర్ చిలక మారి వేణు అధిక దిగుబడులు వస్తాయని మాయమాటలు చెప్పి సేద్యం చేయించాడు. దీంతో ఇద్దరు ఆర్గనైజర్లపై వాజేడు వెంకటాపురం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా వెంకటాపురం మండలం సూడిబాక గ్రామానికి చెందిన అర్జునరావు అనే రైతు ఫిర్యాదు మేరకు సింజంట గొడవర్తి నరసింహా మూర్తి పై బుధవారం కేసు నమోదు అయింది.
Also Read: Minister S Savita: నేతన్నలకు గుడ్ న్యూస్.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..