Minister S Savita (imagecredit:twitter)
ఆంధ్రప్రదేశ్

Minister S Savita: నేతన్నలకు గుడ్ న్యూస్.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..

విజయవాడ స్వేచ్ఛ: Minister S Savita: రాష్ట్రంలోని నేతన్నలకు 365 రోజులపాటు ఉపాధి కల్పిస్తామని, కూటమి ప్రభుత్వ లక్ష్యం ఇదేనని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత చెప్పారు. విజయవాడ నగరంలో  ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాల స్టాళ్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం అన్ని స్టాళ్లను పరిశీలించి మీడియాతో మాట్లాడారు.

నేతన్నలకు అండగా రాష్ట్రంలో చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడమే కూటమి సర్కారు లక్ష్యమని, చేనేతలకు దన్నుగా మరిన్ని ఎగ్జిబిషన్లను అన్ని ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేస్తామని ఆమె ప్రకటించారు. మరోవైపు, సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో నిరుపేదల కోసం ‘ఎన్టీఆర్ అన్న క్యాంటీన్’ ద్వారా పెనుకొండలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద, 640వ రోజు భోజనాన్ని మంత్రి సవిత ఏర్పాటు చేశారు.

Also Read: Anantapur News: ఏపీలో అద్భుతం.. ఆ యువకుడి మాటే నిజమైందా?

ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మరోవైపు, ఇటీవల కురిసిన అకాల వర్షాల ధాటికి అనంతపురం జిల్లాలో దెబ్బతిన్న పంటలను మంత్రి సవిత సోమవారం పరిశీలించారు. తీవ్ర నష్టం కారణంగా ఇద్దరు రైతులు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నేపథ్యంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌నారాయణ్‌ శర్మలతో కలిసి యల్లనూరు, పుట్లూరు మండలాల్లో ఆమె పర్యటించి పంట నష్టాల వివరాలను సేకరించారు.

ప్రభుత్వం తరుపున అన్ని విధాలా ఆదుకుంటామని రైతులకు ఆమె హామీ ఇచ్చారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి అనంతపురంలో చికిత్స పొందుతున్న రైతులను కూడా ఆమె పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె ధైర్యం చెప్పారు.

Also Read: Compensation to Farmers: వడగండ్ల దెబ్బకు ఇంత నష్టమా? పరిహారంపై ప్రభుత్వం ఏం చెప్పిందంటే?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!