Compensation to Farmers (imagecredit:twitter)
తెలంగాణ

Compensation to Farmers: వడగండ్ల దెబ్బకు ఇంత నష్టమా? పరిహారంపై ప్రభుత్వం ఏం చెప్పిందంటే?

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Compensation to Farmers: ప్రభుత్వానికి వర్షానికి పంటనష్టంపై సోమవారం ప్రాధమిక రిపోర్టు అందింది. రాష్ట్రంలో దాదాపు 13 జిల్లాల్లోని 64 మండలాలలో 11,298 ఎకరాలలో నష్టం జరిగినట్లు అంచనా అధికారులు పంపారు. దెబ్బతిన్న పంటల్లో 6670 ఎకరాలలో వరి, 4100 ఎకరాలలో మొక్కజొన్న, 309 ఎకరాలలో మామిడి, మిగలినవి ఇతర పంటలు ఉన్నాయి.

మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ అకాల వర్షాలు, వడగళ్ల వానకు పంటనష్టం జరిగిన రైతులకు పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు. అధికారులు ఈ నెల 21 నుంచి 23 వరకు కురిసిన వర్షానికి జరిగిన నష్టంపై సర్వే చేస్తున్నారన్నారు. ఇప్పటికే ప్రాధమిక నివేదిక అందిందని తెలిపారు. వర్షానికి పంట నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు వెల్లడించారు.

అన్ని జిల్లా కలెక్టర్లకు పంటనష్ట వివరాలు సేకరించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా రైతు వారీగా సర్వే చేసి తుది నివేదిక రూపొందించాలని వ్యవసాయ అధికారులకు సైతం సూచించినట్లు వెల్లడించారు. పంటనష్టంపై పూర్తి నివేదిక అందగానే నష్టపరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Also Read: Komatireddy Venkat Reddy: రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బోనస్ కొనసాగింపు

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!