నర్సంపేట, స్వేచ్ఛ: Narsampet Colleges Association: ప్రైవేట్ కళాశాలలకు పెండింగ్ లో ఉన్న బోధన రుసుములు వెంటనే చెల్లించాలని, డిగ్రీ, పీజీ కళాశాలలను ఆదుకోవాలని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జీజుల సాగర్ కోరారు. నర్సంపేటలో బుధవారం ఈ మేరకు వినతి పత్రాన్ని నర్సంపేట ఆర్డిఓ ఉమారాణికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మూడు సంవత్సరా లుగా పీజీ, డిగ్రీ ప్రైవేట్ కళాశాలలకు ప్రభుత్వం చెల్లించే బోధనా రుసుములు పెండింగులో ఉన్నాయని అన్నారు.
రాష్ట్రం మొత్తంలో రూ. 600 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ కళాశాలలో పనిచేసే అధ్యాపకులు బోధన రుసుముల మీదనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. బోధన రుసుము లు సక్రమంగా రాకపోవడం వల్ల అధ్యాపకులకు వేతనాలు సక్రమంగా రావడం లేదని అన్నారు. కళాశాలల భవనాలకు కూడా అద్దె చెల్లించలేని దుస్థితిలో ఉన్నామని తెలిపారు. 2023లో ప్రభుత్వం బోధనా రుసుములు చెల్లించేందుకు టోకెన్లు ఇచ్చిందని అన్నారు.
Also Read: Telangana Govt: విద్యార్థులకు గుడ్ న్యూస్.. మీ ఖాతాల్లో నగదు జమ..
కానీ, ఇప్పటివరకు టోకెన్లకు డబ్బుల చెల్లింపులు జరగలే దని తెలిపారు. కళాశాలల ను కొనసాగించలేని పరిస్థితిలో యాజమాన్యాలు ఉన్నాయని, కొన్ని యాజమాన్యాలు గుండెపోటు, ఆత్మహత్య లు చేసుకున్నారని తెలిపారు. సెమిస్టర్ పరీక్షలు కూడా నిర్వహించలేమని అన్నారు. గతంలో సమస్యను మీ దృష్టికి తీసుకురావడంతో బకాయి లలో కేవలం 10 శాతం చెల్లించి చేతులు దులుపు కున్నారని అన్నారు. ఇప్పటికైనా బోధన రుసుములు మొత్తం చెల్లించి కళాశాలలను, అధ్యాపకులను ఆదుకోవాలని కోరారు. లేకుంటే ప్రభుత్వం నిర్వహించే అన్ని పరీక్షలను నిర్వహించలేమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు