TDP vs YCP
ఆంధ్రప్రదేశ్

TDP vs YCP: ఏపీలో లిక్కర్ రచ్చ.. కోట్లల్లో నొక్కేశారంటూ టీడీపీ ఆరోపణ

TDP vs YCP:  ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ, వైసీపీ మధ్య లిక్కర్ ఫైట్ నడుస్తోంది. వైసీపీ హయాంలో ఢిల్లీని మించిన లిక్కర్ స్కామ్ జరిగిందని ఎప్పట్నుంచో రచ్చ జరుగుతున్నప్పటికీ.. తాజాగా టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్‌సభ వేదికగా చేసిన సంచలన ఆరోపణతో మరోసారి ఆ అంశం తెరపైకి వచ్చింది. ఏపీ కుంభకోణంతో పోల్చితే ఢిల్లీ స్కామ్ నీటిబొట్టంతే అని, గత ప్రభుత్వ హాయంలో రాష్ట్రంలో దాదాపు లక్ష కోట్ల మద్యం వ్యాపారం జరిగిందని ఎంపీ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టింది. బాబు వచ్చాకే మద్యం సిండికేట్లదే రాజ్యమైందని ధ్వజమెత్తింది. ‘ మద్యంలో దోచుకో.. జేబులు నింపుకో. ఒక్కో బాటిల్‌పై రూ.10 నుంచి రూ.30 వరకూ అదనంగా వసూళ్లు అంటే మద్యం ప్రియులకే కాదు. ప్రభుత్వ ఖజానాకు కూడా ప్రతి రోజూ కోట్ల రూపాయల్లో చిల్లు. రాష్ట్రంలో ప్రతి చోటా ఈ దోపిడీ జరుగుతోందని ఆర్టీజీఎస్ సర్వేలో బట్టబయలు అయ్యింది. ఈ డబ్బు అంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది చంద్రబాబూ?’ అంటూ ‘ఎక్స్’ వేదికగా వైసీపీ ప్రశ్నల వర్షం కురిపించింది.

ఎంపీ ఏమన్నారంటే..
ఐదేళ్లలో రాష్ట్రంలో రూ.99 వేల కోట్ల మద్యం వ్యాపారం జరిగితే అందులో రూ.18 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని, ఇవికాకుండా మరో రూ.4 వేల కోట్లను బినామీల పేరుమీద దుబాయ్, ఆఫ్రికాలకు తరలించినట్లు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన ఆరోపణలు చేశారు. ఈ లావాదేవీలపై ఈడీ దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. దీనిపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

Mana Ooru Mana Badi Scam: కాళేశ్వరంను మించిన పెద్ద స్కామ్ ఇదే.. సంచలన ఆరోపణలు చేసిన మజ్లిస్..

మొత్తం మీరే చేశారు..
అసలు జరగని లిక్కర్‌ స్కాంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, లోక్‌సభలో టీడీపీ ఎంపీ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని, కేవలం డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ ఎం.గురుమూర్తి స్పష్టం చేశారు. అసలు వైసీపీ హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదన్న ఆయన, తమ ప్రభుత్వ హయాంలో మద్యం ధరలు పెంచారని, షాపుల సంఖ్య, మద్యం అమ్మకం వేళలు తగ్గించారని వెల్లడించారు. నిజానికి రాష్ట్రంలో కొత్తగా 200 బ్రాండ్లను తీసుకొచ్చింది చంద్రబాబు హయాంలోనే అని ఎంపీ గుర్తు చేశారు. చంద్రబాబు స్కిల్‌ స్కాంపై పార్లమెంట్‌లో మాట్లాడే దమ్ముందా? అని సవాల్‌ చేశారు. టీడీపీ ఎంపీలకు ధైర్యం ఉంటే చంద్రబాబు అందుకున్న ఈడీ, ఐటీ నోటీసులు చర్చిద్దామని ఛాలెంజ్ చేశారు.

జగన్ ను అరెస్ట్ చేయడానికే?
హామీల అమలులో విఫలమైన కూటమి ప్రభుత్వం తన అసమర్థత నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు లేని లిక్కర్‌స్కామ్‌ను తెరమీదికి తీసుకువచ్చిందని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు డైరెక్షన్‌లో లోక్‌సభలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పచ్చి అబద్దాలను అందంగా వల్లించాడని మండిపడ్డారు. నిన్నటి వరకు వైసీపీలో ఎంపీగా ఉన్న ఆయనకు రాష్ట్రంలో లిక్కర్‌ పాలసీలో ఒకవేళ అవినీతి జరుగుతుంటే ఆ విషయం తెలియలేదా? ఈ రోజు టీడీపీలో చేరి పార్లమెంటరీ నేతగా మారిన తరువాతే లిక్కర్‌స్కాం గురించి తెలిసిందా? అని ప్రశ్నించారు. ఏదో ఒక రకంగా తప్పుడు ఆరోపణలతో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను అరెస్ట్ చేయాలని చూస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్సైజ్ శాఖలో ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి గతంలో తనను బెదిరిస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తులకు విన్నవించారని, ఇప్పుడు ఆయన్ను బెదిరించి తప్పుడు స్టేట్మెంట్లు తీసుకున్నారని చెప్పారు. అమాయకుల పేర్లు చెప్పి ఏదో ఒక రకంగా జగన్‌ను ముద్దాయిని చేయాలని చూస్తున్నారని పేర్ని ఆరోపించారు.

GHMC on Birth Death Certificate: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. బర్త్, డెత్ సర్టిఫికెట్స్ ఇక్కట్లకు ఇక చెల్లు..

వైసీపీ మీద ఎడుపు
‘బాబు వచ్చాక మద్యం సిండికేట్లదే రాజ్యమైంది. ఇష్టానుసారం అమ్మకాలు జరుగుతున్నాయి. లిక్కర్ కంపెనీలు ప్రభుత్వ పెద్దలకు కోట్లు ముడుపులు చెల్లిస్తున్నాయి. ఇదంతా అరాచకమే. వైఎస్ జగన్ హయాంలో లిక్కర్ వ్యాపారం మొత్తం పారదర్శకంగా సాగింది. పైగా ప్రభుత్వ ఆదాయం పెరిగింది..పల్లెల్లో బెల్టు షాపులు జాడ లేదు. మరి స్కాం చేసిందెవరు? ఎంతసేపూ అవతలివాళ్లు మీద పడి ఏడవడం తప్ప చంద్రబాబు తన గురించి తాను తెలుసుకోరు, తప్పులు ఒప్పుకోరు. రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాల్లో నిబంధనలు లేవు, అధికారులు పట్టించుకోరు. ఎమ్మార్పీ ఉల్లంఘనలు, అధికార్లు పట్టించుకోరు. ఇదంతా స్కామ్ కాదా? మరి ఏమీ తెలియనట్లు బాబు నంగనాచి కబుర్లు చెబుతున్నారు. చేయాల్సిందంతా చేసేసి నెపాన్ని పక్కవారిమీదకు నెట్టేయడంలో చంద్రబాబు టాపర్. ఏపీలోని డిస్టిలరీల్లో సింహభాగం బాబు హయాంలో లైసెన్సులు తెచ్చుకున్నవే. నాసిరకం బ్రాండ్లన్నీ బాబు హయాంలో మొదలైనవే. మద్యం వ్యాపారంలో చంద్రబాబుది అందెవేసిన చేయి. ఎంత బిజినెస్ జరిగినా ప్రభుత్వానికి దక్కేది మాత్రం చిటికెడు. మిగతాదంతా తనవాళ్ళ జేబుల్లోకి పోతోంది. జగన్ హయాంలో ఎక్సైజ్ శాఖ ద్వారా భారీగా రాష్ట్రానికి ఆదాయం సమకూరింది’ అని వైసీపీ రివర్స్ ఎటాక్ చేసింది.

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..