Minister Sridhar Babu
తెలంగాణ

Minister Sridhar Babu: క్యాన్సర్ పేషెంట్ కోరిక.. కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి

Minister Sridhar Babu: ఇటీవలి కాలంలో క్యాన్సర్(Cancer) మహామ్మరి చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరిని కబళిస్తున్న సంగతి తెలిసిందే. దురలావట్లు ఉన్న వాళ్లు ఎక్కువగా సిగరెట్లు తాగే వాళ్లకే క్యాన్సర్ రావడం లేదు. ఏ అలవాటు లేకున్నా సరే అది సోకుతుంది. ఇంకా టీనేజీ దాటని కుర్రాళ్లకు కూడా ఈ మధ్య క్యాన్సర్ బారిన పడుతున్నారు.  ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ కూడా ఇటీవల కాన్సర్ కారణంగా మరణించించాడు.  అతను చాలా కాలం పాటు క్యాన్సర్ తో పోరాడి తుదిశ్వాస విడిచాడు.  అయితే తాజాగా, మరో యువకుడి వ్యధ వెలుగులోకి వచ్చింది. తాను జీవితంలో పెద్ద లక్ష్యం సాధించానలనుకున్నానని, ఎన్నో కలలు కన్నానని కానీ విధి మరోలా తలిచిందని ఆ యువకుడు తన ఆవేదన వెళ్లగక్కాడు. అతని దీనస్థితిని చూసిన రాష్ట్ర మంత్రి కంట నీరు గార్చారు.

Saweety Boora: పోలీసు స్టేషన్ లో వాగ్వాదం.. భర్తపై దాడి చేసిన ప్రముఖ మహిళా బాక్సర్

వివరాల్లోకి వెళ్తే..
భూపాలపల్లి(Bhupalapally) జిల్లా పాలిమల మండలం సర్వాయ్ పేట గ్రామానికి చెందిన భౌత్ నితిన్(Nithin) కాన్సర్ తో బాధపడుతూ.. ఖాజగూడలోని స్పర్ష్ హస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి దుద్దళ్ల శ్రీధర్ బాబు స్వయంగా ఆసుపత్రికెళ్లి అతణ్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ బాధితుడు చెప్పిన మాటలు విని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

“సార్, నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. పెద్ద క్రికెటర్ కావాలని కలగన్నా.. నాకో క్రికెట్ కిట్ ఇప్పించండి సార్” అంటూ క్యాన్సర్ తో పోరాడుతున్న నితిన్ చెప్పాడు. నితిన్ మాటలకు చలించిపోయిన మంత్రి.. వెంటనే అతని కోరిన క్రికెట్ కిట్ ను కొనుగోలు చేసి అందించారు. అదేవిధంగా .. నితిన్ అండగా ఉంటానని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. తనను సొంత అన్నలా భావించాలని, సాయం కోరడానికి వెనుకాడొద్దని భరోసా ఇచ్చారు. ఏ అవసరమున్నా నేరుగా తననే సంప్రదించమని ఆ కుర్రాడి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.

తస్మాత్ జాగ్రత్త.. 

మన జీవన విధానంలో మార్పులు, నగరీకరణ, ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లలో మార్పులు వల్ల క్యాన్సర్ వ్యాధి ఎక్కువగా సోకుతుంది. క్యాన్సర్ వ్యాధి వ్యాప్తి నానాటికి పెరుగుతోంది. ఇదివరకటి కంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒకప్పుడు క్యాన్సర్ చికిత్సకు ప్రత్యేకంగా ఆస్పత్రులు ఉండేవి. కానీ ఇప్పుడు ప్రతీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లోనూ క్యాన్సర్ పేషెంట్ల తాకిడి పెరుగుతోంది. ప్రతి రోజూ క్యాన్సర్ కు సంబంధించిన వార్తలు చూస్తూనే ఉన్నాం. కొన్ని యూ ట్యాబ్ ఛానెళ్లు క్యాన్సర్ సోకిన రోగుల వ్యథలను ప్రసారం చేస్తున్నాయి కూడా.

లైఫ్ స్టయిల్ మారిపోయింది.  మనం అలవాట్లు మారిపోయాయి. కొన్ని రకాల అనివార్య పరిస్థితుల్లో కొన్ని చేయవలసి వస్తుంది కానీ అదే సమయంలో ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి.  నిత్యం వ్యాయామం, జీవనశైలిలో మార్పలు ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా నివారించుకోవచ్చు. అలాగే ఇటీవల గమనిస్తే.. చాలా మంది సెలబ్రిటీలు, క్రికేటర్లు ఈ మహామ్మారి నుంచి పోరాడి గెలిచారు. ఆ కథనాలు కూడా మనం గమనిస్తూ ఉంటే  క్యాన్సర్ సోకిన వారికి కూడా కాస్త మనోధైర్యం కలుగుతుంది.

AICC – Telangana Cabinet: ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్.. ఉగాదిలోపే కొత్త మంత్రులు!

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు