GHMC on Birth Death Certificate [ image credit: twitter]
తెలంగాణ

GHMC on Birth Death Certificate: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. బర్త్, డెత్ సర్టిఫికెట్స్ ఇక్కట్లకు ఇక చెల్లు..

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ : GHMC on Birth Death Certificate: జీహెచ్ఎంసీ అడ్డదారిలో అక్రమంగా జారీ చేస్తున్న బర్త్,డెత్ సర్టిఫికెట్ల జారీకి త్వరలోనే బ్రేక్ పడనుంది. తప్పుల్లేని సర్టిఫికెట్లను పారదర్శకంగా జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సివిలియన్స్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) పరిధిలోకి తీసుకెళ్లాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ అందించే అతి ముఖ్యమైన సేవల్లో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రధానమైంది. కానీ ఇటీవలి కాలంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇష్టారాజ్యంగా బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ అయిన వ్యవహారాలు వెలుగుచూశాయి.

Also Read: Cocaine Seized Hyderabad: హైదరాబాద్ లో కొకైన్ దందా.. నైజీరియా దేశస్థుడు అరెస్ట్

గత సంవత్సరం డిసెంబర్ మాసంలో యూసుఫ్ గూడ సర్కిల్ లో హోమ్ బర్త్ కింద సుమారు 70 సర్టిఫికెట్లు జారీ కావటాన్ని గమనించిన కమిషనర్ దానిపై విచారణకు ఆదేశించగా,హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కొందరు శిశుమందిర్ లోని చిన్నారులకు హోమ్ బర్త్ కింద సర్టిఫికెట్ల కోసం క్లెయిమ్ చేసినట్లు తేలగా, మరో 40 సర్టిఫికెట్లు అదే సర్కిల్ పరిధిలో హోమ్ బర్త్ కింద సర్టిఫికెట్లు జారీ అయిన విషయాన్ని వెలికి తీయగా, ఈ సర్టిఫికెట్ల జారీలో సూత్రధారులను గుర్తించేందుకు కమిషనర్ ఇలంబర్తి నేరుగా విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించిన ఘటనలు జరగటంతో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో ఎక్కడ ఎలాంటి అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకోకుండా సివిలియన్స్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) ద్వారా గ్రేటర్ సిటీకి బర్త్,డెత్ సర్టిఫికెట్ల జారీ చేసే విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో వివిధ స్థానిక సంస్థలు ఒక్కో ప్రక్రియలో సర్టిఫికెట్లను జారీ చేస్తున్నాయి. కానీ రాష్ట్రంలోనే అతి పెద్ద స్థానిక సంస్థ జీహెచ్ఎంసీ సర్టిఫికెట్ల జారీని సీఆర్ఎస్ ద్వారా నిర్వహించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

BRS Silver jubilee: బీఆర్ఎస్ సభ షిఫ్ట్ అవుతోందా? సక్సెస్ పై అంత అనుమానమా?

అసెంబ్లీ ముగిసిన తర్వాతే కీలక సమావేశం:

సర్కిల్ స్థాయిలో బర్త్, డెత్ ల రిజస్ట్రేషన్ అధికారం ఉన్న మెడికల్ ఆఫీసర్లు, ఎన్విరాన్ మెంట్, ఇంజనీర్లు వారి వద్ద పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు లంచాలు తీసుకుని ఇష్టారాజ్యంగా బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు కూడా విచారణలో బయట పడటంతో కమిషనర్ పలువురు కంప్యూటర్ ఆపరేటర్లను సైతం విజిలెన్స్ అధికారులు విచారించే వరకూ ఈ అక్రమాలు వెళ్లటం పట్ల పారదర్శకంగా సర్టిఫికెట్ల జారీకి ప్రత్యామ్నాయ మార్గలను అన్వేషిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులకు కమిషనర్ ఇలంబర్తి సెన్సస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నపుడు జీహెచ్ఎంసీ కమిషనర్ గా లోకేశ్ కుమార్ పని చేస్తున్న సమయంలో సీఆర్ఎస్ పరిధిలోకి బర్త్, డెత్ సర్టిఫికెట్లు తీసుకురావాలని ప్రతిపాదిస్తూ లేఖ రాసినట్లు తెలిసింది. కానీ సీఆర్ఎస్ కింద సర్టిఫికెట్లు జారీ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కు పేరు వస్తుందన్న విషయాన్ని గమనించిన అప్పటి సర్కారు పెద్దలు అందుకు నిరాకరించటంలో ఈ ప్రతిపాదన పెండింగ్ లో పడినట్లు తెలిసింది.

Also Read: Stock Fraud Crime:సైబర్ క్రిమినల్స్ కు సాయం చేస్తూ.. అడ్డంగా బుక్కయ్యాడు

నాడు ప్రతిపాదనలు పంపిన అధికారే ప్రస్తుత కమిషనర్ గా వ్యవహారిస్తున్నందున బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ని సీఆర్ఎస్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలైనట్టు సమాచారం. కమిషనర్ ఆదేశాల మేరకు ఇప్పటికే ఓ దఫా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ తో సమావేశాన్ని కూడా నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల తర్వాత మరోసారి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ తో మరోసారి సమావేశాన్ని నిర్వహించి, జీహెచ్ఎంసీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సీఆర్ఎస్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు వీలుగా అనుమతినివ్వాలని కోరుతూ ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా సర్కారుకు లేఖలు రాయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించినట్లు సమాచారం.

సీఎస్ఆర్ సిస్టమ్ తో జారీ చేస్తే..
సివిలియన్స్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా ఇప్పటికే పలు రాష్ట్రాలు బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఈ సిస్టమ్ ద్వారా సర్టిఫికెట్లను జారీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, పకడ్బందీగా జారీ చేయవచ్చునని అధికారులు భావిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే సీఆర్ఎస్ సిస్టమ్ పరిధిలోకి సర్టిఫికెట్ల జారీ తీసుకెళితే, ఈ సిస్టమ్ ద్వారా జారీ అయిన సర్టిఫికెట్ ను దేశంలో మళ్లీ అవసరమైనపుడు దరఖాస్తుదారుడు దేశంలో ఎక్కడి నుంచైనా తీసుకునే వెసులుబాటు కల్గుతుందని అధికారులంటున్నారు. అంతేగాక, ఈ సర్టిఫికెట్ కాపీలను దేశంలో ఎక్కడి నుంచే తీసుకున్నా, వాటిలో సవరణలు చేసినా, ఆ సమాచారం క్షణాల్లో జీహెచ్ఎంసీకి చేరే వెసులుబాటు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు