Cocaine Seized Hyderabad: హైదరాబాద్ లో కొకైన్ దందా.. నైజీరియా దేశస్థుడు అరెస్ట్
Cocaine Seized Hyderabad (imagecredit:AI)
క్రైమ్

Cocaine Seized Hyderabad: హైదరాబాద్ లో కొకైన్ దందా.. నైజీరియా దేశస్థుడు అరెస్ట్

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Cocaine Seized Hyderabad: డ్రగ్స్​ దందా చేస్తున్న నైజీరియా దేశస్తున్ని సెంట్రల్​ జోన్​ టాస్క్​ ఫోర్స్​ అధికారులు కాచిగూడ పోలీసులతో కలిసి అరెస్ట్​ చేశారు. నిందితుని నుంచి 7 గ్రాముల కొకైన్​ ను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్​ ఫోర్స్​ డీసీపీ సుధీంద్ర తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నైజీరియా దేశానికి చెందిన ఎంగ్​ చుక్వు గాడ్విన్​ ఎలియాస్​ గాడ్విన్​ 2015లో స్టూడెంట్​ వీసాపై మన దేశానికి వచ్చాడు.

అనంతరం కాకినాడలోని ఓ ఫార్మసీ కాలేజీలో చేరాడు. కాగా, తన దేశానికే చెంది ఇక్కడ ఉంటూ డ్రగ్స్​ దందా చేస్తున్న కొందరితో అతనికి పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో గాడ్విన్​ కూడా మాదక ద్రవ్యాలను విక్రయించటం మొదలు పెట్టాడు. ఆన్​ లైన్​ ద్వారా చెల్లింపులు చేస్తూ ముంబయి, బెంగళూరులో ఉంటున్న పెడ్లర్ల నుంచి కొకైన్ తీసుకుని హైదరాబాద్​ తీసుకొచ్చేవాడు. ఇక్కడ డగ్ర్స్​ అలవాటు ఉన్నవారికి దానిని డెడ్​ డ్రాప్​ పద్దతిలో అమ్ముతూ వస్తున్నాడు.

Also Read: Nuthankal Murder Vase: హత్య కేసులో.. 13 మంది అరెస్ట్

ఈ క్రమంలో 2022, మే నెలలో ధూల్​ పేట ఎక్సయిజ్ అధికారులు అతన్ని అరెస్ట్​ చేసి జైలుకు రిమాండ్​ చేశారు. బెయిల్​ పై విడుదలై బయటకు వచ్చిన గాడ్విన్​ తిరిగి కొకైన్ అమ్ముతూ 2023, జనవరిలో హయత్​ నగర్​ ఎక్సయిజ్​ పోలీసులకు పట్టుబడి జైలు పాలయ్యారు. కొన్నాళ్లకు బెయిల్​ పై విడుదలయ్యాడు. కాగా, ఇక్కడ పోలీసుల నిఘా ఎక్కువ కావటంతో ముంబయి వెళ్లి అక్కడే స్థిరపడ్డ గాడ్విన్ నెలలో ఒకటి రెండుసార్లు కొకైన్ తో హైదరాబాద్ వచ్చి కొకైన్​ అమ్మకాలు చేస్తున్నాడు.

ఇలాగే ఓ వ్యక్తికి 7 గ్రాముల కొకైన్​ ఇవ్వటానికి కాచిగూడలోని డీ మార్ట్​ వద్ద వేచి చూస్తుండగా సమాచారం అందుకున్న సెంట్రల్​ జోన్​ టాస్క్ ఫోర్స్​ అధికారులు కాచిగూడ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. నిందితునిపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం కాచిగూడ పోలీసులకు అప్పగించారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?