తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: BRS Silver jubilee: గులాబీ ఆలోచనలో పడింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత, గులాబీ కేడర్ లో జోష్ నింపేందుకు పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రణాళికలు రూపొందిస్తుంది. జనసమీకరణపై ప్రత్యేక దృష్టిసారించింది. అయితే వరంగల్ కు ఆశించిన మేర ప్రజలు రాకపోతే పరిస్థితిపై ఆరా తీసింది. పార్టీ భవిష్యత్ సభపైనే ఉండటంతో వరంగల్ నుంచి సభను మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ కు షిఫ్ట్ చేస్తున్నట్లు సమాచారం. పార్టీ నేతల నిర్ణయం మేరకు అధిష్టానం నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తేదీ వరకు 25 ఏళ్లు అవుతుండటంతో సిల్వర్ జూబ్లీ వేడుకలను వైభవంగా నిర్వహించాలని భావిస్తుంది. అందుకోసం ప్రణాళికలు రూపొందిస్తుంది. వరంగల్ లో సభను నిర్వహించేందుకు సిద్ధమైంది. వరంగల్ శివారులోని దేవన్నపేట,కోమటిపల్లిలో సభ నిర్వహణ పరిసరాలను సైతం నాయకులు పరిశీలించారు. అయితే వరంగల్ సభ ప్రాంతం అందరికి అనుగుణంగా లేకపోవడంతో సభకు ప్రజలు వస్తారో రారో అనే ఆలోచనలో పార్టీ అధిష్టానం పడినట్లు సమాచారం.
అందుకే సభా స్థలిని మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ ప్రాంతానికి షిఫ్ట్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ ప్రాంతం అయితే అన్ని జిల్లాలకు చెందిన ప్రజలు తరలివచ్చేందుకు రోడ్డు మార్గం సైతం అనుకూలంగా ఉంటుందని సభాస్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలిసింది. పార్టీ నేతలు సైతం ఈ సభా స్థలి బాగుంటుందని అభిప్రాయం కూడా అధినేత కేసీఆర్ కు చెప్పినట్లు సమాచారం. త్వరలోనే అధికారంగా సభా స్థలి మార్పును ప్రకటిస్తారని తెలిసింది.
Also Read: Telangana Cabinet: మంత్రివర్గం లోకి ఆ 5 మంది? రాములమ్మకు ఎంత అదృష్టమో?
ఏప్రిల్ మాసంలో ఎండలు ఎక్కువ. దీనికి తోడు వరికోతలు సైతం ముమ్మరంగా సాగుతాయి. ప్రజలంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతారు. అందరికీ అనుగుణంగా వరంగల్ ఉండదని సభకు జనంను తరలించడం కష్టమవుతుందని నేతలు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే సభ కు 5 లక్షలకు పైగా తరలించాలని భావిస్తుంది. అసెంబ్లీ, పార్లమెంట్ వరుస ఓటములతో నైరాశ్యంలో ఉన్న కేడర్ లో జోష్ నింపాలంటే సభను సక్సెస్ చేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.
ఒక వేళ సభను సక్సెస్ చేయకపోతే మరింత నైరాశ్యంతో పాటు రాబోయే స్థానిక, మున్సిపల్ , కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఎఫ్టెక్ పడే అవకాశం లేకపోలేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తున్న తరుణంలో ప్రజలను తరలించడంలో విఫలమైతే పార్టీకి మరింత డ్యామేజ్ అవుతుందని పార్టీ అధిష్టానం సైతం భావిస్తుంది. అందుకే సభా స్థలిని మార్పు చేసినట్లు సమాచారం.
గ్రేటర్ లో బీఆర్ఎస్ కు పట్టుంది. 24 అసెంబ్లీ స్థానాల్లో 16 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించగా కంటోన్మెంట్ కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో 15 స్థానాలకు చేరింది. మిగిలిన నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ కు కేడర్ ఉంది. అయితే పార్టీ నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకలను జనంను తరలించడం సులభం అవుతుందని పార్టీ అధిష్టానం భావించినట్లు తెలిసింది. జిల్లాల నుంచి ఆశించిన మేర రాకున్న గ్రేటర్ నుంచి జనం వస్తే భారీ సక్సెస్ అవుతుందని అంచనా కు వచ్చింది.
Also Read: Delimitation – TDP Alliance: ముందు నుయ్యి వెనక గొయ్యి.. ఇరకాటంలో కూటమి.. అసలేం జరుగుతోంది?
పార్టీ సభ గ్రాండ్ సక్సెస్ చేయవచ్చని నేతలు సైతం భావిస్తున్నారు. గ్రేటర్ లోని నియోజకవర్గానికి 10 నుంచి 20వేల మంది తరలించేందుకు ఎమ్మెల్యేలకు టార్గెట్ విధించాలని పార్టీ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అదే విధంగా అన్ని నియోజకవర్గాలకు 5 వేలు టార్గెట్ పెట్టినా సరిపోతుందని ఈ సభతో కేడర్ లో జోష్ నింపాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
వరంగల్ పార్టీకి సెంటిమెంట్. ఉద్యమకాలం నుంచి తొలిసభ అక్కడినుంచే నిర్వహిస్తారు. ఆ సభను సక్సెస్ చేసి పార్టీలో జోష్ నింపుతారు. అయితే ఇప్పటికే పలుమార్లు వరంగల్ లో సభ నిర్వహిస్తామని పార్టీ పేర్కొంది. గత ఏడాది సైతం ప్లీనరీ నిర్వహిస్తామని, భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని లీకులు ఇచ్చింది. కానీ సభ నిర్వహించలేదు. ఈ సారి సైతం నిర్వహిస్తామని సభకు స్ధల పరిశీలన సైతం హరీష్ రావు చేశారు.
కానీ పార్టీ నేతల నిర్ణయం మేరకు జన సమీకరణకు అనుగుణంగా లేకపోవడం, భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని పార్టీ సీనియర్ నేతల అభిప్రాయం మేరకు మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ కు మార్చినట్లు సమాచారం. ఏదీ ఏమైనా పార్టీ సభ స్థలి మార్పు చేస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం కేడర్ లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Kaleshwaram project: డ్రాఫ్ట్ రిపోర్టుపై కాళేశ్వరం కమిషన్ కసరత్తు.. పొలిటీషియన్లకు నోటీసులు ఇచ్చేనా?