Kaleshwaram project (imagecredite:twitter)
తెలంగాణ

Kaleshwaram project: డ్రాఫ్ట్ రిపోర్టుపై కాళేశ్వరం కమిషన్ కసరత్తు.. పొలిటీషియన్లకు నోటీసులు ఇచ్చేనా?

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల డ్యామేజీలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఎంక్వయిరీ దాదాపు ముగింపు దశకు చేరుకున్నది. ఇంజినీర్లు, అధికారులతో సాంకేతిక, ఆర్థిక అంశాలపై విచారణ ప్రక్రియను పూర్తి చేసిన కమిషన్ విధాన నిర్ణయాలకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించింది. ఇప్పటివరకు పూర్తయిన క్రాస్ ఎగ్జామినేషన్‌లో అధికారులు, ఇంజినీర్లు, నిపుణుల నుంచి వచ్చిన వివరాలు, వారు వెల్లడించిన స్టేట్‌మెంట్‌లలోని అంశాలు, సేకరించిన డాక్యుమెంట్లు తదితరాల ఆధారంగా తదుపరి ప్రక్రియపై నిర్ణయం తీసుకోనున్నది.

విధాన నిర్ణయాలను తీసుకున్న రాజకీయ నేతలను కూడా ప్రశ్నించే విషయమై త్వరలో నిర్ణయం తీసుకోనున్నది. ఇప్పటికే ముసాయిదా నివేదిక తయారీపై దృష్టి పెట్టిన కమిషన్ అవసరాన్ని బట్టి తదుపరి ప్రక్రియపై షెడ్యూలు రూపొందించనున్నది. మరోవైపు ఈ మూడు బ్యారేజీల డ్యామేజీకి సంబంధించి రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇప్పటికే అధ్యయనాన్ని పూర్తిచేసినందున ఆ నివేదికలను ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ లేఖ రాసింది. విజిలెన్స్ కమిషన్ ఇప్పటికే రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించగా ఎన్డీఎస్ఏ నివేదిక ఇంకా అందాల్సి ఉన్నది.

వీలైనంత తొందరగా సమర్పించాల్సిందిగా రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా జలశక్తి మంత్రి పాటిల్‌కు, కేంద్ర జల సంఘం చైర్మన్ ముఖేష్ కుమార్ సిన్హాకు విజ్ఞప్తి చేశారు. ఈ రెండు రిపోర్టుల్లోని అంశాలు కూడా కమిషన్ తుది నివేదిక రూపకల్పన సందర్భంగా కీలకంగా మారనున్నాయి. ఇందులోని అంశాలు, సిఫారసులు కూడా కమిషన్ తుది నివేదికలో చోటు చేసుకోనున్నాయి. ఈ రెండు రిపోర్టులు అందే సమయానికి అనుగుణంగా కమిషన్ తుది నివేదికపై స్పష్టత రానున్నది. రాజకీయ నేతలకు నోటీసులు జారీచేసి వారి నుంచి వివరణ సేకరించడంపై ఉత్కంఠ కొనసాగుతున్నది.

Also Read: Meenakshi Natarajan: ఐక్యరాగమెత్తిన కాంగ్రెస్.. మీనాక్షి నటరాజన్ మార్క్ ఇదేనా?

ఇప్పటివరకు క్రాస్ ఎగ్జామినేషన్‌లో అధికారులు, ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు వెల్లడించిన వివరాలను పరిశీలించిన తర్వాత తదుపరి అవసరానికి అనుగుణంగా కమిషన్ నిర్ణయం తీసుకోనున్నది. పలు సాంకేతిక, ఆర్థిక అంశాలపై అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా హరీశ్‌రావు, ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్ పేర్లను వెల్లడించినందున వాటిపైనా స్పష్టత రావాలని కమిషన్ భావిస్తే వారికి నోటీసులు జారీచేసి వివరణ తీసుకునే అవకాశమున్నట్లు కమిషన్ వర్గాల సమాచారం. ఎంక్వయిరీకి రావాల్సిందిగా నోటీసులు జారీ చేస్తే హాజరు కావడానికి సిద్ధమేనని, క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కమిషన్‌కు తెలియజేస్తానని ఈటల రాజేందర్ ఇప్పటికే మీడియాకు వివరించారు.

హరీశ్‌రావు, కేసీఆర్ పేర్లను కూడా రిటైర్డ్ బ్యూరోక్రాట్లు, ఇరిగేషన్ డిపార్టుమెంట్ రిటైర్డ్ ఉన్నతాధికారులు వెల్లడించినందున కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కమిషన్ కాలపరిమితి ఏప్రిల్ చివరకు ముగియనున్నది. అప్పటికల్లా నివేదికను సమర్పిస్తుందా? లేక మరికొంత గడువు కోరుతుందా? అనేది కీలకంగా మారింది.

Also Read: BJP: తెలంగాణ బీజేపీకి తప్పని రథ‘సారధి’ తిప్పలు.. పగ్గాలు ఎవరికో?

గడువు ముగిసే లోపే నివేదిక ఇచ్చేలా కమిషన్ కసరత్తు చేస్తున్నదని, ముసాయిదా నివేదికలో నాల్గింట మూడొంతుల భాగం ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. తుది నివేదికను రూపొందించడంపై కమిషన్ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో పొలిటీషియన్లకు నోటీసులు ఇచ్చే అంశంపై త్వరలో స్పష్టత రానున్నది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున హరీశ్‌రావు, కేసీఆర్‌లకు నోటీసులు ఇవ్వాలంటే స్పీకర్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి అయినందున జస్టిస్ పీసీ ఘోష్ తీసుకునే నిర్ణయం ఆసక్తికరం.

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?