GHMC – Hydra: రానున్న వర్షాకాలంలో నగరంలో ప్రజల కష్టాలను తొలగించే విధంగా మాన్సూన్(Monsoon) యాక్షన్ ప్లాన్(Action Plan) సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ (GHMC Commissioner) ఇలంబర్తి(Ilambarithi), సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫైర్ సేఫ్టీ, మాన్సూన్ యాక్షన్ ప్లాన్, నాలా పూడికతీత, నాలా భద్రతా చెరువుల పునరుద్దరణ అంశాలపై హైడ్రా కమిషనర్(Hydra Commissioner) రంగనాథ్(Ranganath) తో కలిసి కమిషనర్ సమన్వయ సమావేశం నిర్వహించారు.
ముందున్నది ‘ముంచే’ కాలం..
ఈ సందర్భంగా వర్షాకాలంలో నగరంలో ఎదురయ్యే పలు సమస్యలపై ఇరువురు చర్చించారు. నగరంలో ఇప్పటికే గుర్తించిన 141 నీటి నిల్వ ప్రాంతాల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. భవిష్యత్తులో నీటి నిల్వ ప్రాంతాలు లేకుండా శాశ్వత పరిష్కారం చేయాలన్నారు. నాలాల్లో పూడికతీత లోతట్టు ప్రాంతాల్లో సమస్యలకు ఆస్కారం లేకుండా పూడికతీత పనులు వర్షాకాలం లోపు పూర్తి చేయాలని తెలిపారు. అందుకు టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు నగర పౌరుల భద్రతకు, ట్రాఫిక్ అంతరాయం లేకుండా సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని సూచించారు.
Gaddam Shiva Prasad: హరితహారం కార్యక్రమంపై స్పీకర్ మాస్ ర్యాగింగ్.. దెబ్బకు బీఆర్ఎస్ సైలెంట్!
నగరంలోని చెరువుల సంరక్షణ,, పునరుద్దరణ పై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు . అంతేకాకుండా వర్షాల సందర్భంగా చెరువుల ద్వారా ఓవర్ ఫ్లో కాకుండా ముందస్తు నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలని లేక్స్ అధికారులను ఆదేశించారు. తద్వార లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు నివారణకు కృషి చేసినవారవుతారని అన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని వర్షాకాలంలో నాలాలో ప్రమాదాలు సంభవించకుండా నాలా ఆడిట్ చర్యలు తీసుకోవాలని, అందుకోసం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయుటకు సర్కిల్ కు ఒక ప్రత్యేక అధికారిని బాధ్యులను చేయాలని కమిషనర్ సూచించారు.
భారీ వర్షాల సందర్భంగా వాతావరణ శాఖ సూచనలను వార్డు వారీగా తెలియజేస్తున్నా నేపథ్యంలో ప్రజలు బయటికి రాకుండా అప్రమత్తం చేయాలని, చిన్న పిల్లలు, వృద్ధులు రోడ్డు పై ప్రవహించే నీటి లో వెళ్ళకుండా చూడాలని, స్టార్మ్ వాటర్ , మ్యాన్ హోల్స్ తెరవకుండా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. పనులు జరిగినప్పుడు హెచ్చరిక బోర్డులు, విద్యుత్ దీపాలు పెట్టి ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు తీసుకోవాలని సూచించారు.
Warangal Police Commissioner: నిజాయితీగా పని చేయండి.. గౌరవం పెంచండి.. పోలీస్ కమిషనర్
ఫైర్ సెఫ్టీ మేజర్స్..
వేసవిలో అగ్ని ప్రమాదాలను నివారించడానికి చేపట్టాల్సిన చర్యలపై కూడా చర్చించారు. నగరంలో ఉన్న వాణిజ్య, నివాస భవనాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన సురక్షిత ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలన్నారు. అందులో భాగంగా భవన యజమానులు, నిర్వాహకులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎక్కువగా మంటలు వేగంగా వ్యాపించే వస్తువుల స్టోరేజ్ గోడౌన్ లలో, పురాతన భవనాలలో ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ఫైర్ సేఫ్టీ నిర్వహణ సజావుగా ఉండేలా, ప్రమాద నివారణ చర్యలు తీసుకునేలా సంబంధిత యజమానులకు ముందస్తుగా చైతన్య పరచాలన్నారు.
జీహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు, ఫైర్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా క్షేత్ర స్థాయిలో అవసరమైన నివారణా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలకు ప్రమాద నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా అపార్ట్ మెంట్ లు, వాణిజ్య భవనాలలో భవన లేఅవుట్ ప్లాన్, ఫైర్ సేఫ్టి ప్లాన్, ఫైర్ ఎన్వోసీ తదితర అంశాలను విస్తృత స్థాయిలో తనిఖీ చేసి ప్రమాదాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో గత రెండేళ్లలో ఏ ఏ ఏరియా లో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్న అంశాలను పరిశీలించి ఆయా ప్రాంతాల్లో తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు, హైడ్రా అధికారులు, ఫైర్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు.