TG Govt on LRS [ image credit: Ai]
తెలంగాణ

TG Govt on LRS: ప్లాట్ యజమానులకు గుడ్ న్యూస్..ఈ అవకాశం మీకోసమే

నర్సంపేట, స్వేచ్ఛ:TG Govt on LRS: ప్లాట్ల యజమానులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్లాట్ లకు ఎల్ఆర్ఎస్ కోసం గత ప్రభుత్వ హయాంలో యజమానులు దరఖాస్తులు అందించారు. ఈ దరఖాస్తులు సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్నాయి. వాటిపై గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేసింది. దీనివల్ల ప్లాట్లకు క్రమబద్ధీకరణ ఆగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాట్లకు క్రమబద్ధీకరణ కోసం అనుమతి ఇచ్చింది. దీంతో దరఖాస్తుదారులందరి ప్లాట్ లను క్రమబద్ధీకరించుకు నేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నెలాఖరుకు గడువు ఉండడంతో మున్సిపల్ కార్యాలయానికి ఫ్లాట్లే యజమానులు క్యూ కడుతున్నారు. నర్సంపేట మున్సిపాలిటీలో తమ ప్లాట్లను క్రమబద్ధీకరించు కోవడానికి గతంలోనే 6500 మంది దరఖాస్తులు చేసి ఉన్నారు.

Also Read: Minister Sridhar Babu: క్యాన్సర్ పేషెంట్ కోరిక.. కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి

క్రమబద్ధీకరణ చేయించుకునే వారికి 25 శాతం రాయితీ కూడా కల్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు ఫ్లాట్ల యజమానులు ముందుకు వస్తున్నారు. గతంలో ఎల్ఆర్ఎస్ కు అనుమతి లేని ప్లాట్లను ఇప్పుడు రెగ్యులరైజ్ చేయించుకునేందుకు ప్రతి ఒక్కరూ వచ్చి ఫీజు చెల్లిస్తున్నారు. దీంతో నర్సంపేట మున్సిపాలిటీ కార్యాలయం లోని ఎల్ఆర్ఎస్ ప్రత్యేక విభాగంలో సందడి నెలకొంది. ఇప్పటికే ఆయా ప్లాట్లను మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించి వాటి స్థితిగతులను ఆన్లైన్లో నమోదు చేశారు. ఆ ప్లాట్లకు ఫీజు ఎంత చెల్లించాలో భూముల విలువలను బట్టి లెక్కించి మెసేజ్ వస్తున్నది. దానిలో 25% తగ్గించి ప్రభుత్వానికి వెంటనే చెల్లింపులు చేస్తున్నారు. అయితే ఆ యొక్క ధర నిర్ణయించడంలో కొందరు ప్లాట్లు తప్పుగా కూడా నమోదు అవుతున్నాయి.

Also Read: Good News to Women: మహిళలకు గుడ్ న్యూస్.. మీరు డిగ్రీ పూర్తి చేశారా?…

దీనివల్ల చెల్లింపులు చేసే డబ్బులు కూడా పెద్ద మొత్తం లో మెసేజి ఇస్తున్నారు. దీనివల్ల యజమానులు తమకు తప్పులు పడిందని సరి చేయాలని కోరుతూ మున్సిపల్ లోని ఎల్ఆర్ఎస్ విభాగానికి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. 200 గజాల ప్లాటుకు క్రమబద్ధీకరణ కోసం మూడున్నర లక్షలు చెల్లించాల ని మెసేజ్ వచ్చింది. ఇంత మొత్తంలో ఎలా వస్తుందని యజమాని ఫిర్యాదు చేయ డంతో మళ్ళా దానిని సవరించేందుకు పంపించారు. ఇలా ఎన్నారైస్ క్రమబద్ధీకర ణలో డబ్బులు చెల్లింపులో కొంత తప్పుగా నమోదు కావడంతో తిరిగి వాటిని కూడా సరి చేయించేం దుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 2020 తర్వాత రిజిస్ట్రేషన్ అయినా ప్లాట్లను కూడా క్రమబద్ధీకరించుకోవడానికి ముందుకు వస్తున్నప్పటికీ ఈ అవకాశం లేకపోవడంతో వెని తిరుగుతున్నారు.

Also Read: Telangana Govt: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఉగాది నుండి కొత్త పథకం ప్రారంభం..

కొందరు భవనాలను కూడా క్రమబద్ధీకరించుకోవడానికి కార్యాలయానికి వచ్చి సమాచార సేకరిస్తున్నారు. అయితే ఈ అవకాశాన్ని ప్రస్తుతం ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. ఇచ్చిన అవకాశంతో ఎల్లారీస్ లేని ప్లాట్ల ను క్రమబద్ధీకరించు కుంటున్నారు. క్రమబద్ధీకరణ కోసం ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన తర్వాత ప్లాట్ కు డబ్బులు చెల్లించినట్లుగా ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తున్నారు. కొందరు ప్లాట్లను క్రమబద్ధీకరణ చేయకముందుకే అమ్మకాలు కొనుగోలు చేసిన చోట్ల కూడా ఆయా ప్లాంట్లకు సంబంధించిన ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలని సమాచారం ఇప్పటికే అందించారు. అలాంటి చోట్ల అమ్మినవారు కొన్నవారికి సమాచారం ఇస్తున్నారు. వారు కూడా వచ్చి ప్లాట్ ను రెగ్యులరైజ్ చేయించుకుం టున్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

 

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ