ఖమ్మం బ్యూరో స్వేచ్ఛ: Good News to Women: జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించుటకు ఈనెల 26 తేదిన బుధవారం ఉదయం 10.00 గంటలకు తనికెళ్ల తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాల (కేరాఫ్ లక్ష్య ఇంజనీరింగ్ కళాశాల, ఖమ్మం) నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి ఎన్. మాధవి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, విజయవాడ లో పని చేసే విధంగా ఫాక్స్ కాన్, సెన్సా కోర్, ఆల్ఫా, భారత్ బయో టెక్, శిందర్, లైఫ్ సర్కిల్ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎలాన్సర్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జస్ట్ ఇన్ ఫౌండేషన్, సీతారం స్పిన్నర్స్ ప్రైవేటు లిమిటెడ్, జి ఎం.ఆర్. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ఎంపవర్మెంట్ సర్వీసెస్, క్రీం స్టోన్ కంపెనీలలో పని చేయుటకు 18-30 సంవత్సరాల వయస్సు గల డిగ్రీ పాసైన మహిళలు అర్హులని, ఎంపికైన వారికి వేతనం 12 వేల నుండి 18 వేల వరకు ఉంటుందన్నారు.
మొత్తం దాదాపు 1370 ఉద్యోగ ఖాళీల భర్తీకి గాను జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు, తమ విద్యార్హతల సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలతో మహిళలు జాబ్ మేళాకు హాజరు కావాలని జిల్లా ఉపాధి అధికారిణి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read: viral: అంతర్జాతీయ మార్కెట్లో దుమ్ము లేపుతున్న గోలీసోడా.. డిమాండ్ మాములుగా లేదు!