Anantapur News: సాధారణంగా ప్రతీ ఊరులోనూ గ్రామ దేవతలకు భక్తులు ఉంటారు. తమ కోరికలు తీర్చే కొంగు బంగారంలా వారిని భక్తులు పూజిస్తుంటారు. కోళ్లు, మేకలు బలిస్తూ అమ్మవార్లపై తమకున్న భక్తిని చాటుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో కొంతమంది భక్తులకు అమ్మవారు ఒంటిపైకి రావడాన్ని సైతం జాతర, తిరుణాళ్లలో మనం చూస్తూనే ఉంటాం. ఆ సందర్భాల్లో జరగబోయేది సైతం వారు చెబుతుంటారు. ఇందులో నిజా నిజాలు పక్కన పెడితే ఆ మాటలను సాక్ష్యాత్తు తమ ఇష్ట దైవం వాక్కులుగా ప్రజలు భావిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా అనంతపురం జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే
అనంతపురం పట్టణంలో అందరినీ అశ్చర్యపరిచే ఘటన చోటుచేసుకుంది. నగరానికి చెందిన అంజి (Anji) అనే వ్యక్తి తనకు వారం రోజులుగా అమ్మవారు కలలోకి వస్తున్నట్లు చెప్పాడు. నగరంలోని గౌరవ గార్డెన్ వాటర్ ట్యాంక్ సమీపంలో తన విగ్రహం ఉన్నట్లు అమ్మవారి చెప్పిందని యువకుడు పేర్కొన్నాడు. అక్కడ 2 అడుగుల లోతులో ఉన్నానని తన విగ్రహాన్ని బయటకు తీయాలని అమ్మవారు ఆదేశించినట్లు చెప్పారు.
చెప్పిందే.. జరిగింది
యువకుడు అంజి చెప్పిన మాటలు ఆ నోటా ఈ నోటా పాకడంతో స్థానికంగా ఈ విషయం సంచలనం రేపింది. ఈ క్రమంలో యువకుడు చెప్పిన స్థలంలో స్థానికులు తవ్వకాలు జరపగా సరిగ్గా 2 అడుగుల లోతులో గంగమ్మ తల్లి విగ్రహం (Ganagamma Thalli Statue) బయటపడింది. ఈ క్రమంలో అంజి ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. గంగమ్మ తల్లి ఒంటిమీదకు వచ్చినట్లు ప్రవర్తించాడు. దీంతో అంజి చెప్పినట్లే జరిగిందని స్థానికులు చర్చించుకున్నారు.
Read Also: MLA Raja Singh: రాజాసింగ్ యూటర్న్.. సీఎం రేవంత్ పై ప్రశంసలు.. కేటీఆర్ పై విమర్శలు
విగ్రహానికి పూజలు
భూమిలో నుంచి గంగమ్మ తల్లి విగ్రహం బయటపడటంతో స్థానికంగా పండగ వాతావరణం నెలకొంది. అక్కడికి పెద్దఎత్తున తరలివస్తున్న భక్తులు.. అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పసుపు, కుంకుమ, పూలు, నిమ్మకాలు పెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులు కోరికలు నెరవేర్చేందుకు అమ్మవారు స్వయంగా వెలిసారని స్థానికులు విశ్వసిస్తున్నారు.
Read Also This: AP Mega DSC notification: ఏపీ మెగా డీఎస్సీపై లేటెస్ట్ అప్ డేట్.. తీపికబురు చెప్పిన సీఎం చంద్రబాబు..
అందులో వాస్తవమెంతా?
అయితే యువకుడు చెప్పడం.. విగ్రహం బయటపడటం నమ్మే విధంగా లేదని కొందరు నాస్తికులు ఆరోపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ‘భగీరథ’ సినిమాలో ఓ సన్నివేశం గుర్తుకు వస్తోందంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆ సినిమాలో కృత్రిమంగా ఓ విగ్రహాన్ని పెట్టి అమ్మవారు వెలిసిందంటూ హీరో రవితేజ నమ్మిస్తాడు. ఇప్పుడు యువకుడు అంజి కూడా ఆ విధంగానే ఎందుకు చేసి ఉండకూడదు? అని ప్రశ్నిస్తున్నారు. ముందుగానే విగ్రహాన్ని భూమిలో దాచిపెట్టి.. అమ్మవారు చెప్పినట్లుగా నాటకం ఆడి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
Meerpet Murder Case: మీర్ పేట్ మాధవి హత్య కేసులో బిగ్ ట్విస్టు.. డీఎన్ఏ రిపోర్టులో సంచలన నిజాలు