స్వేచ్ఛ, వలిగొండ:Yadadri-Bhuvanagiri incident: రెక్కాడితే గాని డొక్కాడని వ్యవసాయ కూలీలు ఆరోజు పత్తి చేనులో పనిచేసేందుకై వెళుతుండగా ట్రాక్టర్ యజమాని వ్యవసాయ కూలీలను తన ట్రాక్టర్ ట్రాలీలో తీసుకు వెళ్తానని చెప్పి ప్రమాదకరంగా ఉన్న కాలువ కట్టపైనుండి ట్రాక్టర్ నిర్లక్ష్యంగా నడపడంతో 15 మంది వ్యవసాయ కూలీల ప్రాణాలు నీటిపాలుకాగా 17 మంది వ్యవసాయ కూలీలకు గాయాలయ్యాయి
Also read: Meerpet Murder Case: మీర్ పేట్ మాధవి హత్య కేసులో బిగ్ ట్విస్టు.. డీఎన్ఏ రిపోర్టులో సంచలన నిజాలు
అది 2018 సంవత్సరం వర్షాకాలంలో పత్తి చేనులో పనిచేసేందుకు వ్యవసాయ కూలీలను ట్రాక్టర్ ద్వారా తీసుకు వెళ్తుండగా కాల్వ కట్టపై నుండి జారి కాలువ నీటిలో పడిపోగా ట్రాలీ కింద చిక్కుకొని ఊపిరాడక అత్యంత భయంకరంగా, హృదయ విధారకంగా చనిపోయిన సంఘటన చోటుచేసుకుంది. నాటి సంఘటన జాతీయ మీడియా సైతం ప్రచురించడం జరిగింది.
అటువంటి ప్రమాదానికి కారణమైన వ్యక్తికి 7 ఏండ్ల అనంతరం నల్లగొండలోని ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయవాది మోటార్ వాహనాలు చట్టం ప్రకారం A1. ఆలూరు వెంకట్ నారాయణ ఛీ 10 సంవత్సరాల జైలు శిక్ష జరిమానా A2. ధూళిపాల నాగేశ్వరరావుకు జరిమానా విధించడం జరిగిందని స్థానిక ఎస్ ఐ యుగంధర్ గౌడ్ తెలిపారు.
Also read: Nuthankal Murder Vase: హత్య కేసులో.. 13 మంది అరెస్ట్
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/