Nuthankal Murder Vase [image creditL: ai]
నార్త్ తెలంగాణ

Nuthankal Murder Vase: హత్య కేసులో.. 13 మంది అరెస్ట్

సూర్యాపేట, స్వేచ్ఛ : Nuthankal Murder Vase: ఈనెల 17వ తేదీన నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో జరిగిన మెంచు చక్రయ్యగౌడ్ హత్యకు సంభంధం ఉన్న 13 మంధిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ నరసింహ వివరించారు. ఈ నెల 17 వ తేదీన మిర్యాల గ్రామంలో సాయంత్రం సమయంలో సుమారు 4:30 సమయంలో మెంచు చక్రయ్య గౌడ్ ను అదే గ్రామానికి చెందిన దుండగులు కర్రలు, మారణ ఆయుదాలతో దాడి చేసి అత్యంత పాశవికంగా హత్యచేసిన విషయం పై నూతనకల్ పోలీస్ స్టేషన్లో హత్యకేసు నమోదు చేశామన్నారు.

SLBC tunnel – CM Revanth Reddy: రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ.. స్పెషల్ ఆఫీసర్ నియామకం..

ఈ నేరానికి పాల్పడిన వారిని పట్టుకోవడం కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశామన్నారు. దీనిలో భాగంగా సోమవారం ఉదయం తుంగతుర్తి పరిధిలో వాహనాలు తనికి చేస్తుండగా చక్రయ్య హత్యలో పాల్గొన్న వ్యక్తిని, హత్యకు కుట్ర పన్నిన సొంత కుటుంబ సబ్యులైన అల్లుడు కనకటి వెంకన్న అలియాస్ వెంకటేశ్వర్లు, అతని భార్య సునీత తో కలిపి మొత్తం 13 మందిని ఆధుపులోకి తీసుకున్నమన్నారు. వీరిని విచారించగా పూర్తి వివరాలు వెల్లడించారు, గ్రామంలో అన్నీ కార్యకలాపాల్లో చక్రయ్య ఆదిపత్యం కొనసాగుతున్నదని దానిని తొలగించుకునేందుకు తన అల్లుడు అయిన కనకటి వెంకన్న తన అనుచరులైన కనకటి శ్రవణ్, కనకటి లింగయ్య, కనకటి ఉప్పలయ్య, కనకటి శ్రీకాంత్, గంధసిరి వెంకటేష్, పెద్దింటి మధు, పెద్దింటి గణేష్ లను ఈనెల 17న వ్యవసాయ పొలానికి వెళ్ళి వస్తున్న చక్రయ్యను అడ్డగించి ఆయుదాలు మరియు వెదురు కర్రలతో అతి కిరాతకంగా హత్య చేశారన్నారు.

Kaleshwaram project: డ్రాఫ్ట్ రిపోర్టుపై కాళేశ్వరం కమిషన్ కసరత్తు.. పొలిటీషియన్లకు నోటీసులు ఇచ్చేనా?

అయితే ఈ హత్యతో సంబంధం ఉన్న కనకటి వెంకన్న, కనకటి ఉప్పలయ్య, దిండిగల నగేశ్, జక్కి పరమేష్ , మన్నెం రమేశ్, కనకటి వెంకన్న @ మొండి వెంకన్న , కనకటి సునీత, కనకటి శ్రావ్య, కనకటి స్వరూప, కనకటి కల్యాణి, వర్దెల్లి అనూష జక్కి స్వప్నా, భారీ సతీష్ లను మొత్తం 13 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. అయితే ఈ కేసు ఛేదించడము సమర్దవంతంగా పని చేసిన సూర్యాపేట డి.ఎస్.పి రవి, తుంగతుర్తి సీఐ శ్రీను, నూతనకల్ ఎస్సై మహేందరనాధ్, నూతనకల్, మద్దిరాల ఎస్సైలు ఎం.వీరయ్య, ఆర్.క్రాంతి కుమార్, నూతనకల్ పోలీసు స్టేషన్ సిబ్బందిని అభినంధించారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు