Bowenpally Market: మార్కెట్ కు వెళ్తున్నారా..ఈ రూల్స్ పాటించాలి.
Bowenpally Market [image credit: canva]
హైదరాబాద్

Bowenpally Market: మార్కెట్ కు వెళ్తున్నారా.. ఈ రూల్స్ పాటించాల్సిందే..

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Bowenpally Market: శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా బోయిన్​ పల్లి మార్కెట్​ లో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయాలని మార్కెట్​ కమిటీ ప్రతినిధులకు నార్త్​ జోన్ పెరుమాళ్​ సూచిం​ డీసీపీ రష్మీచారు. ఎవరు పడితే వాళ్లు మార్కెట్​ లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మార్కెట్​ కు నిత్యం వచ్చే రైతులు, కూరగాయాలతో వచ్చే వాహనాలకు పాసులు ఇవ్వాలని చెప్పారు. బోయిన్​ పల్లి మార్కెట్​ లో రైతులు, వ్యాపారులతో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ మాట్లాడారు. మార్కెట్​ ప్రాంతంలోని అన్ని వ్యూహాత్మక చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న 35 కెమెరాల్లో కేవలం 16 మాత్రమే పని చేస్తున్నట్టు తెలిపారు.

Also Read: Yuva Vikasam Scheme: కార్పొరేషన్స్ మళ్లీ యాక్టివ్.. ఏకంగా రూ. 6 వేల కోట్లు కేటాయింపు..

మిగతా కెమెరాలు కూడా పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీటికి అదనంగా మరికొన్ని కెమెరాలు పెట్టాలన్నారు. వ్యాపారులు తమ తమ షాపుల వద్ద సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కనీసం 30 రోజుల ఫుటేజీని భద్రపరుచుకోవాలని చెప్పారు. మార్కెట్ లో డ్రగ్స్​ వినియోగం జరగకుండా చూడాలన్నారు. అదేవిధంగా మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

 Also Read; Komatireddy Venkat Reddy: రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బోనస్ కొనసాగింపు

సైబర్​ నేరాల గురించి తెలియచేస్తూ వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒక్క పోలీసులే అంతా చేస్తారనుకోవద్దని చెబుతూ మార్కెట్​ కమిటీ ప్రతినిధులు, వ్యాపారులందరూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే 100 నెంబర్​ కు డయల్​ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో మార్కెట్​ కమిటీ ప్రతినిధులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Shambala Movie: సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ నుంచి ‘నా పేరు శంబాల’ సాంగ్ రిలీజ్..

Jagga Reddy: కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకుని ఓడినా సరే వారు నాకు సర్పంచులే: జగ్గారెడ్డి

Mowgli Controversy: ‘అఖండ 2’ సినిమా ‘మోగ్లీ’ని డేమేజ్ చేసిందా?.. నిర్మాత స్పందన ఇదే..

Local Body Elections: తెలంగాణ పల్లెల్లో మొదలైన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్..!

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..