Viral News (image credit:Pixeles)
Viral

Viral News: గ్రాండ్ గా పెంపుడు కుక్క బర్త్ డే.. మరి అన్ని లక్షలా ..?

Viral News: ప్రస్తుతం, సోషల్ మీడియా వాడకం రోజు రోజుకు పెరిగిపోతుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్ లో వీడియోస్ చూస్తూ.. వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. మరి ముఖ్యంగా, రీల్స్ అనే ఫీచర్ వచ్చాక ఒక్కొక్కరు తమకున్న టాలెంట్ ను బయట పెడుతున్నారు. ప్రపంచ నలుమూలల్లో ఏం జరిగినా స్మార్ట్ ఫోన్లో క్షణాల్లో వచ్చేస్తుంది. ఇలా రోజు నెట్టింట కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని బాగా వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా, మహిళా సంబంధించిన వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇది చదివాక.. మీరు కూడా షాక్ అవ్వడం పక్కా..! మరి, ఇంతకీ ఆమె ఏం చేసిందో ఇక్కడ తెలుసుకుందాం..

మనం ఇప్పటి వరకు పిల్లలు , పెద్దలు పుట్టిన రోజులు సెలెబ్రేట్ చేయడం చూశాము .. కానీ, ఇప్పుడు జంతువులకు కూడా బర్త్ డే ఫంక్షన్స్ చేసి వార్తల్లో నిలుస్తున్నారు. ఇది వినడానికి షాకింగ్ గా ఉన్నా .. ఇదే నిజం. ఈ మధ్య కాలంలో ఇదొక ట్రెండ్ గా మారింది.

పెంపుడు కుక్కలను కొనేటప్పుడు ఒక పార్టీ, కొన్నాక ఇంకో పార్టీ .. మళ్ళీ ఏడాది అయ్యాక బర్త్ డే పార్టీలు అంటూ సగం డబ్బును వారు ప్రేమగా చూసుకునే డాగ్స్ పైనే చాలా మంది ఖర్చు పెడుతున్నారు. ఒకప్పుడు ఇతర దేశాల్లో ఇలాంటివి చూశాము.. ఇప్పుడు మన దేశంలో కూడా ఎక్కువయ్యాయి. తాజాగా జార్ఖండ్‌కు చెందిన మహిళ తన పెంపుడు కుక్క పుట్టిన రోజును చాలా గ్రాండుగా నిర్వహించింది. మనుషులు కూడా ఇంత డబ్బు ఖర్చు పెట్టి చేసుకోరు. అక్షరాల రూ. 5 లక్షలు ఖర్చు చేసింది.

ఆమె తన పెంపుడు కుక్కను ప్రేమను చూసుకుంటూ ..కేక్ కూడా కట్ చేయించింది. ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నా ఇంటి కుటుంబ సభ్యులు వాటిని ప్రేమగా చూసుకుంటారు. తమ పెంపుడు కుక్కపై  ఏనలేని మమకారాన్ని చూపిస్తూ .. కన్న బిడ్డలతో సమానంగా చూసింది. అంతేకాదు ఈమె ఫ్యామిలీ ప్రతి ఏడాది తమ పెంపుడు కుక్క పుట్టిన రోజును గ్రాండుగా నిర్వహిస్తున్నారు.

Also Read: Good News to Muslims: ముస్లింలకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం..

ఒక బర్త్ డే ఫంక్షన్ ఎలా అయితే జరిపిస్తామో అచ్చం అలాగే రూ.40,000 తో ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ను కట్ చేయించారు. అంతే కాదు అతిథులు 300 మంది హాజరయ్యారు. డెకరేషన్ అందర్ని ఆకట్టుకుంది. కొందరైతే.. కుక్కకు బహుమతులు కూడా ఇచ్చారు. అక్కడికి వచ్చిన వారందరూ రోజు వారికే కాకుండా అందరికి గుర్తుండి పోతుందని చెప్పుకొచ్చారు. ఇదే కొనసాగితే .. ముందు ముందు మనుషులతో పాటు కుక్కలు కూడా బర్త్ డే ఫంక్షన్స్ కి పోటీ పడతాయి.

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?