మహబూబాబాద్ స్వేచ్ఛ: Mahabubabad news: మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో పనిచేసే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పిఎఫ్) ఎస్సై తాను ప్రమోషన్ పొందాలనే తాపత్రయంలో… తప్పులో కాలేసి తన పై అధికారులు సస్పెండ్ చేసేదాకా తెచ్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే… కొంతమంది గిరిజనులు ఇళ్లలో పెంచుకునే పశువుల కోసం ఆంధ్ర రాష్ట్రం నుంచి కేసముద్రం మండలానికి నల్ల బెల్లం తీసుకొస్తుంటారు.
Also read: Crime: మరీ ఇంత దారుణమా.. ప్రియుడి కోసం బిడ్డనే.. తల్లి చేసిన ఘోరం!
ఇలా నల్ల బెల్లం తీసుకొచ్చే కొంతమంది గిరిజనులను వృత్తిలో భాగంగా తనిఖీలు చేసి ఆ ఎస్సై పట్టుకున్నాడు. ఆ తర్వాత తన వక్రబుద్ధిని బయటపెట్టి అదే గిరిజనులను వ్యాపారం చేయమని ప్రోత్సహించాడు. కేజీలు కేజీలు తీసుకొస్తే ఏం లాభం వస్తుంది.. క్వింటాళ్లకొద్ది తీసుకొచ్చి అక్రమ వ్యాపారం చేసుకోమని ఉచిత సలహా ఇచ్చాడు. చేసిన వ్యాపారంలో తలా కొంచెం లాభాన్ని పంచుకుందామని భరోసా ఇచ్చాడు. ఇంకేముంది అధికారి అండగా ఉంటానంటే అక్రమ వ్యాపారం చేసుకునే వాళ్లకు అడ్డేముంటుంది. ఇక్కడ అదే జరిగింది. ఇలా వ్యాపారం చేసుకుంటుంటే ఎస్సై
అదే వ్యాపారులను నల్ల బెల్లం తీసుకొస్తుండగా అరెస్టు చేసి ప్రమోషన్ పొందాలనుకున్నాడు.
Also read: Police Officer Dies: పోలీస్ ఆఫీసర్ ప్రాణం తీసిన ఆర్టీసీ బస్సు..
నల్ల బెల్లం తరలిస్తున్న గిరిజనులనురైల్వే స్టేషన్లలో పట్టుకుని పోలీస్ స్టేషన్ లకు తరలించి కేసులు పెట్టించే దుశ్చర్య కు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే గిరిజన యువకులను తన బెల్టుతో విచక్షణారహితంగా కొట్టడంతో బాధితులు తట్టుకోలేక జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఈ విషయం రైల్వే అధికారుల దృష్టికి వెళ్లడంతో ఎంక్వైరీ కోసం ఢిల్లీ రైల్వే అధికారులు మహబూబాబాద్ కు చేరుకొని ఈ ఘటనలకు సంబంధించిన వివరాలను పూర్తిస్థాయిలో సేకరించారు. అక్రమాలకు పాల్పడుతున్న ఎస్సై ని సస్పెండ్ చేసే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/