చిత్తూరు, స్వేచ్ఛ: Illegal Lottery Tickets Sale: సీఎం నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కేంద్రమైన చిత్తూరు నడిబొడ్డున అక్రమ లాటరీ దందా కొంతకాలంగా కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్, ఎస్పీలు పట్టణంలోనే ఉంటున్నా వారిని ఖాతరు చేయకుండా లాటరీ ముఠా ఈ దందాను కొనసాగిస్తోంది. ఒక్క చిత్తూరు నగరంలోనే ప్రతిరోజు దాదాపు రూ.30 లక్షల లాటరీ అక్రమ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Naga Vamsi: 50వ సినిమా పవన్ కళ్యాణ్‌తో చేయను.. నాకు ఇష్టమైన ఎన్టీఆర్‌తో చేస్తా!
బాలాజీ అనే వ్యక్తి చిత్తూరు నగర నడిబొడ్డున లాటరీ ప్రింటింగ్ మిషన్ పెట్టుకొని ప్రజలకు కుచ్చుటోపి పెట్టి దోచుకుంటున్నాడు. ఇటీవల ఓ చోరీ కేసులో 4 గంటల్లోనే దొంగలను పట్టుకున్న పోలీసులు, అక్రమ లాటరీ వ్యవహారాన్ని అరికట్టలేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరకాలం పూర్తవుతున్నా లాటరీ ముఠాను పోలీసులు నియంత్రించలేకపోతున్నారని జనాల్లో టాక్ వినిపిస్తోంది.
Also Read: YS Sharmila: చంద్రబాబు, జగన్, పవన్.. ఒక్కటి కావాలి.. షర్మిల సంచలన ట్వీట్..
సీఎం చంద్రబాబు సొంత జిల్లా కేంద్రంలోనే సాక్షాత్తు ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడి కనుసైగల్లో ఈ లాటరీ దందా జరుగుతోందని ఆరోపిస్తున్నారు. దందాలు ప్రతిపక్షానివి, చీవాట్లు అధికార పక్షానికి పడుతున్నారని విమర్శిస్తున్నారు. దినసరి కూలీలు చాలా మంది అక్రమ లాటరీ వ్యాపారానికి బానిసలై కుటుంబ సభ్యులు రోడ్డున పడేస్తున్నారు. ఈ లాటరీ దుకాణాలు పోలీస్ స్టేషన్లకు కూతవేటు దూరంలోనే ఉండడంతో విస్తుగొల్పించే విషయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Operation Garuda In AP: ఏపీలో ఇకపై అలా కుదరదు.. పోలీస్ సీరియస్ వార్నింగ్..
పుష్ప ఎవరు?
చిత్తూరు నగరంలో అక్రమ లాటరీ ముఠా చెలరేగిపోతున్నప్పటికీ దీని వెనుక ఉన్న ‘పుష్ప’ ఎవరు? అనేది తేలడం లేదు. లాటరీ కింగ్ పిన్‌గా బాలాజీనే ఉన్నాడా?, లేక, వెనుకండి ఇంకెవరైనా నడిపిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చిత్తూరులో ఓపెన్ సీక్రెట్‌గా లాటరీ వ్యాపారం జరుగుతున్నప్పటికీ పోలీసులు దాని జోలికి వెళ్లకపోవడంపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రభుత్వ వైఫల్యమా? లేక అధికారుల వైఫల్యమా? అనే సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ బాబు, డీజీపీలకు రాతపూర్వక ఫిర్యాదులు ఏమైనా అందుతాయా? లేదో చూడాలి.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు