ఎల్బీనగర్, స్వేచ్ఛ : Police Officer Dies: రోడ్డు ప్రమాదంలో అడిషనల్ ఎస్పీ మృతి చెందిన ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున జరిగింది. హయత్ నగర్ సీఐ నాగరాజు గౌడ్ తెలిపిన వివరాలు.. పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీలోని లక్ష్మారెడ్డి పాలెంలో నివాసం ఉంటున్న అడిషనల్ ఎస్పీ నందీశ్వర బాబ్జీ (50) శనివారం ఉదయం వాకింగ్ వెళ్లి జాతీయ రహదారి పై ఉన్న హనుమాన్ దేవాలయం సమీపంలో రోడ్డు దాటుతున్నాడు.
Also Read: RIDF scheme CM Revanth: మహిళలకు గుడ్ న్యూస్.. తక్కువ వడ్డీకే రుణాలు?
ఆదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ39విఏ9563) అతివేగంగా నిర్లక్ష్యంగా బాబ్జీని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆర్టీసీ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న నందీశ్వర బాబ్జి ఇటీవలే అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ పొందినట్లుగా తెలుస్తుంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా హయత్ నగర్ సీఐ నాగరాజ్ గౌడ్ వెల్లడించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ Swetcha Daily Telugu Epaper – Swetcha daily Telangana లింక్ క్లిక్ చేయగలరు