అంతర్జాతీయం

Houthis Missile Attack : ఎర్రసముద్రంలో కార్గోనౌకపై హౌతీల దాడి.. ముగ్గురు సిబ్బంది మృతి

Houthis Missile Attack on Cargo Ship : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ జ్వాలలు ఇప్పుడు మధ్యప్రాచ్యంలోని ఇతర ప్రాంతాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు బుధవారం గల్ఫ్ ఆఫ్ అడెన్‌లోని రవాణా నౌకపై క్షిపణితో దాడి చేశారు. గాజాలో హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిన తర్వాత గాజాలో హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన మొదటి దాడి ఇది.

బార్బడోస్ ఫ్లాగ్ షిప్ ‘ట్రూ కాన్ఫిడెన్స్’పై ఈ దాడి జరిగింది. దాడిలో షిప్ పూర్తిగా దెబ్బ తినగా.. ముగ్గురు సిబ్బంది మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు అమెరికా అధికారులు ధృవీకరించారు. నౌకపై క్షిపణి దాడి జరిగిన సమయంలో.. 20 మంది సిబ్బంది, ముగ్గురు సాయుధ గార్డులు ఉన్నారు. వారిలో భారత్ కు చెందిన వారు ఒకరు, వియత్నాంకు చెందిన వారు నలుగురు, ఫిలిప్పీన్స్ కు చెందినవారు 15 మంది సిబ్బంది ఉన్నట్లు నౌక యాజమాన్యం పేర్కొంది.

యెమెన్ నగరమైన ఎడెన్ కు 90 కిలోమీటర్ల దూరంలో.. స్థానిక కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ దాడి జరిగింది. ఇది చైనా నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళ్తున్నట్లు ట్రాకింగ్ డేటా ద్వారా తెలుస్తోంది. అయితే పాలస్తీనా కు మద్దతుగా.. గత నవంబర్ నుంచీ హౌతీ తిరుగుబాటుదారులు చేస్తున్న దాడులలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. నౌకకు కూడా భారీ నష్టం జరిగినట్లు యాజమాన్యం తెలిపింది. ఈ దాడిపై యెమెన్ లోని బ్రిటీష్ రాయబార కార్యాలయం స్పందించింది.

కార్గోషిప్ పై దాడి ఘటనలో అమాయకులైన ముగ్గురు సిబ్బంది మరణించారని తెలిపింది. రెండ్రోజుల్లో హౌతీలు ఐదుసార్లు యాంటి షిప్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశారు. యూఎస్ఎస్ కార్ని లక్ష్యంగా ప్రయోగించిన 3 యాంటి షిప్ మిస్సైళ్లను, డ్రోన్లను కూల్చివేసినట్లు అమెరికా దళాలు పేర్కొన్నాయి.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?