సిరిసిల్ల, స్వేచ్ఛ: RTO office – Sircilla: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే స్వంత నియోజకవర్గంలో ఆర్టీఓ ఆఫీస్ నేటికి అద్దె భవనంలోనే కొనసాగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణాశాఖ కార్యాలయం ఇరుకు భవనంలో జనవాసాల మధ్య ఏర్పాటు చేశారు. ఇరకు గదుల్లో సిబ్బంది ఇబ్బంది పడుతుండగా జనావాసల మధ్య ఆఫీస్ ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అన్నీ సమస్యలే…
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో ఏర్పాటు చేసిన ఆర్టీఏ కార్యాలయం దినదిన గండంగా మారుతోంది. ఇరుకుగా ఉండటంతో పాటు చీకటి గదులలో సేవలు అందించాల్సిన పరిస్థితి నెలకొంది. కార్యాలయానికి మైదానం లేకపోవడంతో వాహనాల రిజిస్ట్రేషన్లు,డ్రైవింగ్ టెస్టుల ప్రక్రియ తలనొప్పిగా మారింది.పేపర్ వర్క్ అంతా ఇక్కడ పూర్తి చేస్తే ఫిజికల్ టెస్టులకు మాత్రం మరో చోటుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
Also Read: Hyderabad Student In USA: అమెరికాను మెప్పించిన ఎల్బీ నగర్ కుర్రాడు కోట్లల్లోనే.... జీతం
వాహనాల ఫిజికల్, డ్రైవింగ్ టెస్ట్ లు చేసేందుకు కొంతదూరంలో ఉన్న ప్రైవేటు స్థలాన్ని వినియోగిస్తున్నారు. 2010 లో సిరిసిల్ల సమీపంలోని టెక్స్ టైల్ పార్క్ వద్ద ఐదెకరాల స్థలాన్ని కేటాయించినప్పటికీ అక్కడ నేటికీ ఎలాంటి నిర్మాణాలు జరపలేదు.ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్న కార్యాలయం ఇరుకుగా ఉండడంతో సేవల కోసం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయ సిబ్బంది చీకటి గదుల్లోనే విధులు నిర్వహిస్తున్నారు.
Also Read: IAS Pratima Singh:పెండింగ్ ఉంచొద్దు.. ఎన్నికల ఖర్చు వివరాలు అందజేయండి.. జాయింట్ కలెక్టర్
ఆఫీస్ ఆవరణలో ప్రజలు కూర్చునేందుకు కుర్చీలు కూడా లేకపోవడంతో ఎండలోనే నిలబడి సేవలు పొందుతున్నారు. కార్యాలయంలో సరైన సదుపాయాలు కల్పించాలని అధికారులను కోరిన పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇక్కడకు వచ్చే వారి వాహనాలను నిలిపేందుకు సరైన పార్కింగ్ సదుపాయం కూడా లేకపోవడంతో రోడ్ల వెంబడి వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. విద్యానగర్ వాసులకు,వీధుల్లో వెళ్లే వాహనదారుల రాక పోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
2016 లో జిల్లా ఏర్పాటు అనంతరం ఎంవీఐ కార్యాలయాన్ని ఆర్టీఏ కార్యాలయంగా అప్ గ్రేడ్ చేశారు. అయితే ప్రస్తుతం ఎంవీఐ ఆఫీసు కొనసాగుతున్న అద్దె భవనంలోనే ఆర్టీఏ ఆఫీస్ ను కూడా నిర్వహిస్తున్నారు. తంగళ్ళపల్లి మండలంలోని టెక్స్టైల్ పార్కులో సొంత స్థలం కేటాయించినా కూడా అక్కడ భవనాలు నిర్మించి కార్యాలయాన్ని తరలించేందుకు మాత్రం అధికారులు ప్రతిపాదనలు చేపట్టడం లేదు.
Also Read: Lakshmi Devi Palli Reservoir: బీఆర్ఎస్ పక్కన పెడితే.. కాంగ్రెస్ అభయ ‘హస్తం’..
ఐదెకరాల సువిశాలమైన స్థలంలో సొంత భవనం నిర్మించకుంటే ఒకే చోట అన్ని రకాల కార్యకలాపాలను నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. పదేళ్ల పాటు మంత్రిగా పని చేసి, ప్రస్తుతం సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ నియోజకవర్గంలో సర్కార్ ఆఫీసుకు స్వంత భవనం ఏర్పాటుపై ఎందుకు దృష్టి సారించలేదనే చర్చ జరుగుతుంది. ఇప్పటికైన అధికారులు చోరవ తీసుకొని కొత్త కార్యాలయం నిర్మాణానికి నిధులు కేటాయించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని పలువురు కోరుతున్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https:https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు