Pawan Kalyan (Image Source: Twitter)
Viral

Pawan Kalyan: ఆ విషయంలో పవన్ తీవ్ర అసంతృప్తి.. ట్వీట్ వైరల్

Pawan Kalyan: పిచ్చుకలు ఒకప్పుడు గ్రామ నేస్తాలుగా, మన జీవితంలో ఒక భాగమై ఉండేవి. గ్రామాల్లో పంటల మధ్య చల్లగా కూసి, మన జీవితాన్ని సంతోషకరంగా మార్చేవి. ప్రకృతిని సైతం సమతుల్యంగా ఉంచేవి. అయితే ఇటీవల కాలంలో పిచ్చుకుల జాడ క్రమంగా తగ్గిపోతోంది. కనుచూపమేర పిచ్చుకలు ఎక్కడా కానరాని పరిస్థితి. ఆ జాతి అంతరించిపోయిందా? అన్న ఆందోళనలు సైతం చాలా మందిలో ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. పిచ్చుకల గురించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 20 అంతర్జాతీయ పిచ్చుకుల దినోత్సవం సందర్భంగా వాటి గురించి ఆసక్తికర పోస్టు పెట్టారు.

పవన్ ఏమన్నారంటే..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పిచ్చుకల ఉనికి తగ్గిపోతుండంపై ఎక్స్ (Twitter) వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘మన పరిసరాలు ఒకప్పుడు పిచ్చుకల ఉల్లాసమైన కిలకిలరావాలతో నిండి ఉండేవి. అవి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాయి. అయితే వేగవంతమైన అభివృద్ధి, కాంక్రీట్ అరణ్యాలు, పెరుగుతున్న రేడియేషన్ వాటిని ప్రమాదంలోకి నెట్టాయి. అంతర్జాతీయ పిచ్చుకుల దినోత్సవం సందర్భంగా మనమంతా ఓ బాధ్యత తీసుకుందాం. భవిష్యత్ తరాలు ఆ పిచ్చుకల శబ్దాలు ఆస్వాదించే విధంగా సంకల్పిద్దాం. చెట్లను నాటడం, వేసవిలో ఆరుబయట నీరు, ధాన్యాలను పెట్టి వాటిని తిరిగి తీసుకొచ్చేందుకు సహాయపడదాం’ అంటూ పవన్ రాసుకొచ్చారు.

పిచ్చుకలు – మన నేస్తాలు
పిచ్చుకలు మన జీవితంలో అనేక రకాలుగా, అనేక విధాలుగా ప్రాముఖ్యతను పొందిన పక్షులు. గ్రామాల్లో, ఒకప్పుడు, వీటిని మన నేస్తాలుగా ఉండేవి. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతిరోజూ మేల్కొన్నప్పుడు ‘కుకు’ అంటూ చప్పుడు చేస్తూ మనసుకు ఆహ్లాదాన్ని అందిచేవి. అవి జీవితానికి సంతోషాన్ని, ప్రశాంతతను తీసుకురావడం ముఖ్యభూమిక పోషించాయి. పిచ్చుకల ద్వారా మనం ప్రకృతిలో ఉన్న వివిధ జీవుల, చెట్ల, పంటల మధ్య జీవన సంబంధాలను తెలుసుకునేందుకు వీలుంటుంది. పిచ్చుకల శబ్దం చెట్లలో, పంట పొలాల్లో మురళి వాయిద్యంలా.. ఒక స్వచ్ఛమైన ప్రకృతి సంగీతంగా అనిపించేది.

పిచ్చుకల జీవనశైలి
గ్రామాల్లో పిచ్చుకలు సాధారణంగా చెట్లపై గూళ్లు చేసి నివసించేవి. పంటలు, చిన్న చెట్లు, పొలాలు పిచ్చుకలకు మంచి ఆశ్రయాలు. అలాగే, అవి తరచుగా “కుకు, కుకు” అంటూ పిలిచే శబ్దంతో తమ ఆవాస ప్రాంతాలను ఆహ్లాదంగా మలిచేవి. ఈ పిచ్చుకల శబ్దం మనం ఇళ్ల వద్ద కూడా విని దానిని మన జీవితంలో ఒక భాగంగా భావించేవారు. ప్రజల రోజువారీ బిజీ జీవితంలో ఈ శబ్దం మనకు ఒక చిన్న విశ్రాంతిని ఇచ్చేది. పిచ్చుకలు పంటలు, పురుగులు, ఆకులు తినేవి. అవి ప్రకృతిలో ఒక సహజమైన వ్యత్యాసాన్ని సంరక్షించేవి. ఇది పంటలకు సహాయపడుతూ రైతులకు ఎంతో మేలు చేసేవి. ఈ చిన్న పక్షులు వ్యవసాయ వ్యవస్థలో అవసరమైన విధిని పోషించేవి.

Also Read: Barry Wilmore’s daughter: నాన్నా నువ్వెక్కడ? బుచ్ విల్మోర్ కుమార్తె వీడియో వైరల్..

పిచ్చుకలు తగ్గిపోతున్నాయి
ఇదిలా ఉంటే ప్రస్తుత కాలంలో మన ఊర్ల, పట్టణాలలో పచ్చని ప్రాంతాలు తగ్గిపోతున్నాయి. చెట్లు, పొలాలు, తోటలు తగ్గడం, నిర్మాణాలు పెరగడం వల్ల పిచ్చుకలు నివసించే స్థలాలు క్షీణిస్తున్నాయి. వాటికి అవసరమైన ఆహారం, నీరు కూడా దొరకకపోతుండటంతో పిచ్చుకలు కాలక్రమేణా తగ్గిపోతున్నాయి.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?