Barry Wilmore's daughter (image credit:Twitter)
Viral

Barry Wilmore’s daughter: నాన్నా నువ్వెక్కడ? బుచ్ విల్మోర్ కుమార్తె వీడియో వైరల్..

Barry Wilmore’s daughter: ప్రతి బిడ్డకు తన తండ్రి పాఠశాలలో వదిలిపెట్టే సంధర్భం మరువలేనిది. తల్లిదండ్రులు ఎవరైనా పాఠశాలకు వస్తే, పిల్లలకు కలిగే ఆనందం వేరు. ఇలాంటి ఆనందాన్ని ఇచ్చే అనుభూతిని ఏ పిల్లలైనా కోరుకుంటారు. తండ్రి ఉన్నాడు కానీ.. ఇక్కడ కాదు. 8 రోజుల్లో వస్తానమ్మా అంటూ వెళ్లాడు.. ఏకంగా 9 నెలలు రాలేదు. ఆ చిన్నారి పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదు. చివరకు నాన్న వచ్చాడు. ఆ బాలిక ఆనందానికి అవధుల్లేవు. తన ఆనందాన్ని ఆ బాలిక సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఆ ఆనందకర మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు విషయంలోకి వెళితే..

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు జూన్ 5, 2024 లో వెళ్లిన విషయం తెలిసిందే. జూన్ 14 నే భూమి మీదికి రావాల్సి ఉంది. కానీ వారు వెళ్లిన వ్యోమనౌకలో హీలియం లీకేజి కారణంగా టెక్నికల్ సమస్యలు రాగా 9 నెలలు అక్కడే ఉండిపోయారు. నాసా ఎట్టకేలకు క్రూ-10 మిషన్‌ ను ప్రయోగించి వారిద్దరినీ భూమి మీదికి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. గతంలో రెండు దఫాలు వీరిని భూమి మీదికి తెచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ, సాంకేతిక కారణాలతో ఆ ప్రయత్నం ఆగింది. చివరికి నాసా చేసిన మూడవ ప్రయత్నం విజయవంతమైంది. వారిద్దరు ఎట్టకేలకు భూమి మీదికి చేరుకున్నారు.
అయితే సునీతా విలియమ్స్ గురించి యావత్ ప్రపంచానికి తెలుసు. ఆమెతో పాటు వెళ్లిన బుచ్ విల్మోర్ కు ప్రస్తుతం పాపులారిటీ పెరిగింది. నేషనల్ మీడియాతో పాటు సోషల్ మీడియా మొత్తం వీరి రాక సాగాలని కోరుకుంది. ఎక్కడ చూసినా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ గురించే చర్చ. 9 నెలలు అంతరిక్షంలో ఎలా ఉన్నారంటూ కొందరు ఆశ్చర్యానికి లోనైతే, మరికొందరు హమ్మయ్య.. ఎలాగైనా తిరిగి వచ్చారని తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటున్నారు.

బుచ్ విల్మోర్ గురించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. విల్మోర్ కు ఇద్దరు కుమార్తెలు సంతానం. వారిలో ఒకరి పేరు డారిన్ విల్మోర్. ప్రస్తుతం ఈమె ప్రాథమిక స్థాయి చదువును కొనసాగిస్తోంది. అయితే తన తండ్రి అంతరిక్షంలో చిక్కుకున్న విషయాన్ని తెలుసుకున్న డారిన్ విల్మోర్ తెగ బాధ పడింది. తన బాధను టిక్ టాక్ ద్వారా సమాజానికి తెలిపింది. పలు వీడియోలు పోస్ట్ చేసి, తన తండ్రి తిరిగి రావాలని కోరుకుంది. అయితే 8 రోజుల యాత్ర అంటూ తన తండ్రి చెప్పిన మాటలు గుర్తు చేస్తూ.. 9 నెలలైనా ఇంకా రాలేదు అంటూ ప్రతి రోజూ వీడియోలు పోస్ట్ చేస్తూ వచ్చింది. నాసా తన తండ్రిని అంతరిక్షం నుండి వెనక్కు తీసుకువచ్చే ప్రయత్నాలు తెలియని డారిన్ విల్మోర్.. నా తండ్రి అంతరిక్షంలో చిక్కుకున్నాడు.. ఇక వస్తాడో రాడో అర్థం కావడం లేదంటూ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Also Read: Krystyna Pyszkoza – Hyderabad: మనసు దోచిన ప్రపంచ సుందరి.. మన గురించి తెగ వాగేసింది

నాసా ప్రయోగం ఫలించి ఎట్టకేలకు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదికి రావడంతో డారిన్ విల్మోర్ తెగ సంబర పడింది. మా నాన్నతో పెద్ద ప్లాన్ వేశాను.. నన్ను స్కూల్ నుండి తీసుకు వచ్చే డ్యూటీ వేయబోతున్నా అంటూ డారిన్ విల్మోర్ మళ్లీ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ కు మిలియన్స్ వ్యూస్ వచ్చేశాయి. ఎంతైనా తన తండ్రికి 9 నెలలు దూరమైన కుమార్తెకు ఆ మాత్రం ప్రేమ ఉంటుంది. అది కూడా కుమార్తెకు నాన్న అంటేనే ప్రేమ అంటుంటారు. ఇలాంటి ఘటనలు చూస్తే.. అది నిజమని ఎవరైనా అనాల్సిందే. డారిన్ విల్మోర్ వీడియోలు వైరల్ కాగా.. కంటే కూతురునే కనాలిరా అంటూ మన భారతీయులు కామెంట్స్ చేస్తున్నారు.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం