నర్సంపేట, స్వేచ్ఛ: Donthi Madhava Reddy: కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లోనే నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఒక్క ఇల్లు ఇయ్యలేదని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసి, ముగ్గులు పోసిన అనంతరం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇల్లు లేని అర్హులైన ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు.
Also Read: KCR – KTR: ఇల్లు దాటని కేసీఆర్.. జిల్లాల బాటలో కేటీఆర్.. క్యాడర్ లో గందరగోళం!
ప్రజలు ఎవరు ఆందోళన చందవద్దని సూచించారు. ఎస్సీ,ఎస్టీలకు ఇంటి నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు,బీసీ ఇతర సామాజిక వర్గాలకు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుల గణనను చేపట్టిందని అన్నారు.
Also Read: Hyderabad Cyber Crime: వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నాడు.. పని లేదన్నాడు.. అంతా దోచేశాడు
ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ను ప్రకటించిన ఘనత కూడా కాంగ్రెస్దేనని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అన్నింటిని కాంగ్రెస్ అమలు చేస్తున్నదని తెలిపారు. గత పది ఏళ్ల కాలంలో బిఆర్ఎస్ ప్రజలకు అనేక హామీలను ఇచ్చి అమలు చేయడంలో విఫలమైందని అన్నారు . ఈ విషయం ప్రజలు కూడా గమనించారని తెలిపారు . మాట ఇస్తే అమలు చేసేది కాంగ్రెస్ అనే విషయాన్ని గమనించాలని కోరారు .ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు