నర్సంపేట, స్వేచ్ఛ: Mission Bhagiratha : మిషన్ భగీరథ నర్సంపేట పట్టణం ప్రజలకు అందని ద్రాక్షల మారింది. గత ప్రభుత్వ హయాం లో మిషన్ భగీరథ తో ఇంటింటికి తాగునీరు అందిస్తామన్న హామీ నర్సంపేట పట్టణంలో నీటి మూటలు అయింది. మిషన్ భగీరథ నీరు పట్టణంలోని ప్రజలు అందుకోలేకపోతున్నారు. ఇంట్రా విలేజ్ పనులు అస్తవ్యస్తంగా మారాయి. ఇంకా ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ మిషన్ భగీరథ నీళ్లు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.
పాకాల నీళ్ళు గతి…
నర్సంపేట పట్టణానికి మొదటి నుంచి ఇప్పటివరకు పాకాల వాగు నీళ్లే అందుబాటులో ఉన్నాయి. ఈ నీళ్లు తాగడం వల్ల ప్రజలు కామెర్లు, విష జ్వరాలు, చర్మవ్యాధులు, ఇతర వ్యాధుల బారిన పడుతున్నారు. పాకాల వాగు నీరు డైరెక్ట్ గా పంపింగ్ కావడం వల్ల చెత్తాచెదారంతో కలుషితమై ఉంటున్నది. కొన్ని సంవత్సరాల పాటు పాకాల వాగు నుంచి వచ్చే నీటిని ఫిల్టర్ బెడ్ల సహాయంతో ప్యూరిఫై చేసి అందించారు. ఇప్పుడు కుళాయి నీరు అంటేనే నర్సంపేట ప్రాంత ప్రజలకు తాగడానికి జంకుతున్నారు.
కొన్ని సంవత్సరాల పాటు నర్సంపేట నియోజకవర్గంలోని ఫ్లోరైడ్ సమస్య పరిష్కరించడానికి డీఫ్లోరైడ్ ప్రాజెక్టును అశోక్ నగర్ లో నిర్మించి దాని నుంచి నీటిని అందించారు . గత ప్రభుత్వం పదేళ్లపాటు ఈ నీటిని కూడా గ్రామాలకు సరఫరా చేయకపోవడంతో ప్రాజెక్టు మూలన పడింది. నర్సంపేట లో ప్రస్తుతం 60 వేల నుంచి 70 వేల వరకు జనాభా నివసిస్తున్నది. 24 వార్డులుగా ఉన్న మున్సిపాలిటీ ఇటీవలే 8 గ్రామ పంచాయతీల విలీనంతో ముందుకు వెళ్తున్నది.
Also read: Rajanna Sircilla Crime: బురిడి బాబా రాసలీలలు.. వీడు మామూలోడు కాదు!
గత ప్రభుత్వం మిషన్ భగీరథ నీటిని అందించడం వల్ల తాగునీటి సమస్య తీరుతుందని అందరూ భావించారు. కానీ పట్టణానికి సరిపడా పైపులైన్లు, నీళ్లు సరఫరా కావడం లేదు. దీనివల్ల పట్టణ ప్రాంత ప్రజలకు ఇప్పటికీ తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రతి వీధికొక మినరల్ వాటర్ ప్లాంట్ ప్రైవేట్ వి ఏర్పడ్డాయి. వీటిలో రూ.20 చొప్పున కొనుగోలు చేసుకొని ప్రజలు వాటినే తాగాల్సిన పరిస్థితి నెలకొంది.
మున్సిపాలిటీ కుళాయిల నుంచి వచ్చే నీటిని మాత్రము ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు. వేసవిలో కూడా ఈ పాకాల వాగు నీరు కుళాయిల ద్వారా అరకొరగానే సరఫరా అవుతున్నది. వేసవికాలం వచ్చిందంటే నర్సంపేట పట్టణంలో నీటి సమస్య తీవ్రంగానే ఉంటుంది. పాకాల చెరువు నీటిని వేసవిలో పాకాల వాగు ద్వారా అందించి ప్రతిఏటా సమస్యను పరిష్కరించుకుంటున్నారు. మిషన్ భగీరథ నీరు అన్ని వార్డుల్లోని ప్రజలకు అందుతుందని భావించిన కూడా నిరాశే ఎదురైంది.
పట్టణానికి అదనంగ, గతం లో ఉన్న దానికంటే ట్యాంకులు నిర్మించినప్పటికీ అలంకారప్రాయంగానే మిగిలాయి. మినీ స్టేడియం, బొంద బడి, సర్వాపురం, శాంతినగర్, మున్సిపాలిటీ లో నిర్మించిన ట్యాంకులతో సమస్య పరిష్కారం కాలేదు. మిషన్ భగీరథ పథకంలో నిర్మించిన ఈ ట్యాంకులు ఆచరణలో అమలకు సాధ్యం కాలేదు. ట్యాంకులు నిర్మాణం అయ్యాయి కానీ చుక్క నీరు ప్రజలకు అందని దుస్థితి నెలకొంది.
అమృత్ పథకం లో రూ. 30.49 కోట్లు….
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సంపేట పట్టణ ప్రజలకు తాగునీటిని అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అమృత్2 పథకంలో రూ. 30.49 కోట్లు మంజూరు చేసింది. దీనిలో పైపులైన్లు. ట్యాంకును నిర్మించనున్నారు. డీఫ్లోరైడ్ ప్రాజెక్ట్ నీటిని పట్టణానికి వాడుకొని పూర్తిస్థాయిలో నీటి సమస్యను పరిష్కరించేందుకు పనులు మొదలుపెట్టారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రత్యేక ప్రతిపాదనను తయారు చేయించి ప్రభుత్వం వద్ద నిధులను మంజూరు చేయించారు.
Also read: KCR – KTR: ఇల్లు దాటని కేసీఆర్.. జిల్లాల బాటలో కేటీఆర్.. క్యాడర్ లో గందరగోళం!
ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిం చారు. దీనిలో భాగంగా వడ్డెర కాలనీలో ఉన్న బాలికల జూనియర్ కళాశాల ఆవరణ లో 600 కే ఎల్ ఈ ఎల్ ఎస్ ఆర్ నిర్మాణం జరుగుతున్నది. ఈ నిర్మాణం పనులు గత సెప్టెంబర్ లో మొదలై ఇంకా జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయితేనే పూర్తిస్థాయిలో ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది.