AP crime
క్రైమ్

AP Crime: కన్న బిడ్డలనే కాలువలోకి తోసిన తండ్రి.. 7ఏళ్ల కూతురు మృతి.. ఏపీలో ఘటన

AP Crime: కడపులో పెట్టి కాపాడుకుంటారు అనేది కేవలం కన్నవారిని ఉద్దేశించి చెప్పే మాట. ఎంత పెద్ద నేరం చేసిన బిడ్డల్ని క్షమిస్తారు కాబట్టి, తమ ప్రాణాల కూడా పణంగా పెట్టి కడుపున పుట్టిన వారి క్షేమాన్ని కాంక్షిస్తారు కాబట్టే ఆ మాట వచ్చింది. కానీ ఇటీవలి కాలంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే.. కన్నవారు కూడా కర్కశంగా తయారయ్యారా? అన్న అనుమానం కలుగుతోంది. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుండటం మరింత ఆవేదనకు గురి చేస్తోంది.

నిన్న గాక మొన్న ఏపీ(AP)లోని కాకినాడ(Kakinada)లో కన్న తండ్రే.. తన ఇద్దరు పిల్లల కాళ్లు, చేతులు కట్టేసి నీటిలో ముంచి చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటనను చూశాం. ఉన్నత చదువులు చదివి, ఉన్నత ఉద్యోగం చేస్తున్న వ్యక్తే ఇలా పాశవికంగా ప్రవర్తించడం చూసి అందరూ హుతాశులయ్యారు. అలాంటి ఘటన మరిచిపోక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

పట్టుమని పదేళ్లు కూడా నిండని తన ఇద్దరు పిల్లలని ఓ తండ్రి కాలువలో తోసేశాడు. ఈ ఘటనలో ఏడేళ్ల కుమార్తే చనిపోగా, పదేళ్ల కొడుకు మాత్రం ప్రాణాలతో బయటపడగలిగాడు. ఈ దారుణానికి పాల్పడ్డ తండ్రి ఆచూకీ తెలియరాలేదు. అతను ఆత్మహత్య చేసుకున్నాడా? లేక పరారయ్యాడా? అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు అతని ఆచూకీ కనిపెట్టే పనిలో ఉన్నారు. ఈ విషాధ ఘటన అంబేద్కర్ కోనసీమ(Konaseema) జిల్లా రాయవరం(Rayavaram) మండలం వెంటూరు(Ventur) గ్రామంలో చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆ వ్యక్తి ఈ దారుణానికి ఒడి గట్టినట్లుగా తెలుస్తోంది.

ఆర్థిక ఇబ్బందులే కారణమా?

వెంటూరు గ్రామానికి చెందిన పిల్లి రాజు అనే వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు రామ్ సందీప్(10), కుమార్తె కారుణ్య(7)లు ఉన్నారు. అయితే పిల్లి రాజును ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. వ్యాపార భాగస్వామి మోసం చేశారని, తనకు రూ. 30 లక్షల మేర సదరు పార్టనర్ నుంచి రావాల్సిఉందని కొద్ది రోజులుగా ఈ విషయం తన భార్య దగ్గర చెప్పుకొని భాదపడేవాడని తెలుస్తోంది. ఆ సందర్భంగా కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుందామని భార్యతో కూడా తరచూ అనేవాడని తెలిసింది.

Also Read: Case Filed on Influencers: బెట్టింగ్ ఎఫెక్ట్.. 11 మంది ఇన్​ ఫ్లూయెన్సర్లపై కేసు.. జాబితా చూస్తే షాక్ కావాల్సిందే

ఈ క్రమంలో రాజు సోమవారం పిల్లలు చదివే స్కూలుకు వెళ్లిన రాజు.. వాళ్లిద్దరిని తనతో పాటు బయటికి తీసుకెళ్లాడు. చాలా సేపు వాళ్లని తిప్పిన తర్వాత కోరంగి కెనాల్ లో పిల్లలిద్దర్ని తోసేశాడు. ఈ ప్రమాదంలో కుమార్తె కారుణ్య మృతిచెందగా, కుమారుడు సందీప్ మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. బాలుడ్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. కారుణ్య మృతదేహాన్ని బయటకు తీశారు. కానీ పిల్లి రాజు మాత్రం ఎమయ్యాడో తెలియలేదు.

అయితే, తండ్రి రాజే తమను కాలువలో పడేశాడని బాలుడు చెప్పడం అందరిని కలిచివేస్తోంది. అంతకుముందు రోజంతా తనను, చెల్లెని బైక్ మీద తిప్పినట్లు, అప్పుడే చనిపోదామని కూడా చెప్పినట్లు సందీప్ వెక్కి వెక్కి ఏడుస్తూ వివరించాడు. కాగా, చనిపోయిన బాలిక మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ కి తరలించారు. సంఘటనపై ద్రాక్షారామ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అయితే.. పొలం అమ్మేసి కష్టాల నుంచి బయటపడదామని రాజు భార్య పలుమార్లు అతనికి నచ్చజెప్పిన కూడా ఇంతటి ఘాతుకానికి ఎందుకు పాల్పడి ఉంటాడనేది అనుమానంగా ఉంది.

ఇక, ఇటీవల వరుసగా ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటుండటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ హబ్సిగూడలో సైతం పిల్లలను చంపేసి తల్లిదండ్రులు ఆత్మహత్య  చేసుకోవడం కలకలం రేపింది.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?