KCR [ image credit: twitter]
Politics

KCR: జిల్లాలకు కేసీఆర్.. సిల్వర్ జూబ్లీ సక్సెస్ కోసమేనా?

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ:KCR: బీఆర్ఎస్ 25 ఏళ్ల సిల్వర్ జూబ్లీ సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తుంది. బీఆర్ఎస్ 25 ఏళ్ల సిల్వర్ జూబ్లీ సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తుంది. ఈ నెల 20న సూర్యాపేట, 23న కరీంనగర్ జిల్లా నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు.

సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. పార్టీ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు,సంబురాలను నిర్వహిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వంచిస్తున్న తీరు పైన కేడర్ కు మార్గదర్శనం చేయనున్నారు. 14 ఏళ్ల ఉద్యమం ప్రస్థానంతోపాటు, పదేళ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ సమాజంతో బీఆర్ఎస్ పార్టీ పెనువేసుకున్న ఆత్మీయ అనుబంధాన్ని మరోసారి గుర్తుచేయనున్నారు.

పార్టీకి ఎన్నిరకాల ఒడిదుడుకులు ఎదురైనా గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకుని నిలబడ్డ పార్టీ శ్రేణులకు రానున్న రోజుల్లో మళ్లీ ఉజ్వల భవిష్యత్తు ఉండబోతున్న విషయాన్ని వివరించనున్నారు. ఏడాదిన్నరలోనే తీవ్రమైన ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ సర్కారుపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని, తెలంగాణ ప్రజల భరోసా ఇప్పుడు బీఆర్ఎస్ పై, కేసీఆర్ పైనే ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత క్రియాశీలకంగా పనిచేయాలని దిశానిర్దేశం చేయబోతున్నారు.

Also Read: CM Revanth Reddy: తప్పలేదా? తప్పించుకోలేకనా?.. రేవంత్ రెడ్డికి జై కొట్టిన ప్రతిపక్షాలు..

ప్రజలు ప్రశ్నిస్తే జర్నలిస్టులను జైలుకు పంపుతారా?

అక్రమ కేసులతో ఆడబిడ్డలను జైల్లో వేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని కేటీఆర్ ప్రశ్నించారు. చంచల్ గూడ జైల్లో ఉన్న జర్నలిస్టులు రేవతి, తన్వియాదవ్ లను సోమవారం పరామర్శించారు.న్యాయపోరాటం చేస్తామని హామి ఇచ్చారు. జనం నిలదీస్తే ..ప్రజలు ప్రశ్నిస్తే జర్నలిస్టులపై ఉక్కు పాదం మోపుతారా? జైలుకు పంపుతారా? అని ప్రశ్నించారు.

ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న అసహనాన్ని చూపిస్తున్న డిజిటల్ జర్నలిస్టులపై అక్రమ కేసులు, దాడులతో వేధించడం ప్రజాస్వామ్య హననమే” అన్నారు.కాంగ్రెస్ చెప్పిన ఇందిరమ్మ రాజ్యం అంటే అదేదో సంక్షేమ రాజ్యం అని ప్రజలు భ్రమపడ్డారన్నారు. కేసీఆర్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని అపోహ పడ్డారని తెలిపారు.

కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యవహార శైలిని చూస్తుంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రోజులే అన్న సంగతి మరోసారి స్పష్టం అయిందన్నారు. 6 గ్యారంటీలతో పాటు ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యమని పెద్ద పెద్ద మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి, ప్రజలు గొంతు విప్పితే మాత్రం తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని ప్రజలు అంతా ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారని చెప్పారు.

డీలిమిటేషన్ పై కాంగ్రెస్ కు స్పష్టత లేదు

డీలిమిటేషన్ అంశంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత లేదని కేటీఆర్ అన్నారు. అఖిలపక్ష సమావేశ నిర్వహణపై ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. దేశంలో అందరికంటే ముందు డీలిమిటేషన్ వల్ల తెలంగాణకు, దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే నష్టాల గురించి మాట్లాడిందే బీఆర్ఎస్ అన్నారు. డీఎంకే పార్టీ కన్నా ముందే చాలా కాలం నుంచి డి లిమిటేషన్ వలన దక్షిణాదికి జరగబోయే నష్టం గురించి జాతీయ వేదికల పైన మాట్లాడుతున్నామన్నారు.

Also Read: CM Revanth Reddy: నేటి రాజకీయాలపై.. సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్..

దేశ ప్రయోజనాల కోసం పాటుపడిన దక్షిణాది రాష్ట్రాలకు డిలిమిటేషన్ విధానం వలన నష్టం జరుగుతుందని చెప్తూ వస్తున్నామన్నారు. డీలిమిటేషన్ పైన జరిగే నష్టాల పైన కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా చెప్తామన్నారు. డీలిమిటేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పైన పోరాడుతామన్నారు. డిలీమిటేషన్ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఉన్న బాధ్యత ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. 22న చెన్నైలో జరిగే డీఎంకే సమావేశానికి హాజరవుతామని, పార్టీ విధానాన్ని బలంగా వినిపిస్తామని వెల్లడించారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్