తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Hyderabad Crime: అబం శుభం తెలియని అప్పుడే పుట్టిన పసికందును అత్యంత పాశవికంగా హత్య చేసిన కిరాతకుల ఉదంతమిది. ఈ దారుణం ఎన్టీఆర్ స్టేడియం వద్ద సోమవారం వెలుగు చూసింది. పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న ఆ శిశువు మృతదేహాన్ని చూసి కొంతమంది స్ధానికులు చిక్కడపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంను వెంటనే రప్పించారు.
పోలీసుల జరిపిన విచారణలో ఇంకా కళ్లు కూడా పూర్తిగా తెరవని చిన్నారిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టింది ఎవరు? అన్నది తెలుసుకోవటానికి పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో హత్య జరిగిన ప్రదేశంతోపాటు ఆ స్థలానికి వెళ్లే అన్ని రహదారుల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. ఈ విషాదంపై మాట్లాడగా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారులు చెప్పారు.
Also Read: Nandamuri Kalyan Ram: ప్రాణం పోయడం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టే స్త్రీమూర్తుల కోసమే ఈ సినిమా..
నిందితులను తప్పకుండా పట్టుకుంటామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో పుట్టిన శిశువును చంపి ఉండవచ్చన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేశారు. లేదంటే ఆడపిల్ల అని చంపేశారా? అన్నది నిర్ధారించుకోవాల్సి ఉందని పోలీసులు చెప్పారు.