DK Aruna (image credit:twitter)
హైదరాబాద్

DK Aruna: డికె అరుణ ఇంట్లో భద్రత పెంపు.. ఆదేశాలిచ్చిన సీఎం

తెలంగాణ బ్యూరో స్వేచ్చ: DK Aruna: బీజేపీ ఎంపీ డీ.కే.అరుణ ఇంట్లో చోరీ యత్నం జరిగిన నేపథ్యంలో హైదరాబాద్​ కమిషనర్​ సీ.వీ.ఆనంద్​ సోమవారం జూబ్లీహిల్స్​ లోని ఆమె నివాసానికి వెళ్లారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అనంతరం దొంగ ఇంట్లోకి ఎలా చొరబడ్డాడు?…ఎలా బయటకు వెళ్లాడు? అన్న వివరాలు తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్​ రోడ్డు నెంబర్​ 56లో ఎంపీ డీ.కే. అరుణ నివాసం ఉంది. ఇదెలా ఉండగా శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఓ దొంగ ప్రహారీగోడ దూకి ఆమె ఇంటి ఆవరణలోకి ప్రవేశించాడు.

అనంతరం వంట గది వద్ద ఉన్న కిటికీ తెరిచి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లోని హాల్​ తో పాటు వేర్వేరు గదుల్లో దాదాపు గంటన్నరపాటు కలియ దిరిగాడు. అదడికి విలువైన వస్తువులేవీ చేతికి చిక్కక పోవటంతో వచ్చిన దారినే మల్లి తిరిగి పారిపోయాడు. దీంతో ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఎంపీ డీ.కే.అరుణ కూడా జరిగిన ఈ ఉదంతంపై ఆందోళన వ్యక్తం చేశారు. దొంగ ఇంట్లోకి చొరబడినపుడు తన కూతురు ఇంట్లోనే ఉందని చెప్పారు. అలికిడికి నిద్ర మేల్కొని బయటకు వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అన్న కలవరాన్ని ఆమే వ్యక్తం చేశారు.

Also Read: Nizamabad Crime News: కన్నతల్లిని చంపిన కుమార్తె.. నిజామాబాద్ లో దారుణం..

దీంతో వెంటనే తన నివాసం వద్ద పటిష్టమైన  భద్రతా ఏర్పాట్లు చేయించాలని సీఎం రేవంత్​ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే  స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి జరిగిన చోరీ యత్నంపై ఆరా తీశారు. వెంటనే ఎంపీ నివాసానికి వెళ్లి పరిస్థితులను సమీక్షించి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్ సీ.వీ.ఆనంద్​ సోమవారం ఎంపీ నివాసానికి వెళ్లారు. ఇంటి వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించారు.

Also Read: Bihar Crime: చోరీలలో ఇదో వెరైటీ.. గోల్డ్ రింగ్స్ మింగేసి మరీ..

Just In

01

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?