Cyber Fraud: సైబర్ నేరాలు ఏ రేంజ్ లో పెరిగిపోయాయో అందరికి తెలిసిందే. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండటం కోసం సర్కార్ వాయిస్ మెసెజ్ అలర్ట్ లను కూడా ఇస్తోంది. అయినా సైబర్ మోసాలు(cyber crimes) ఆగడం లేదు. కేటుగాళ్లు బెదరడమూ లేదు. ఒక దానికి చెక్ పెట్టే లోపే ఇంకో కొత్త మార్గాన్ని అన్వేషిస్తున్నారు. ప్రతి సారి ఓ కొత్త పద్ధతి ద్వారా అప్రోచ్ అవుతూ జనాలను బురిడి కొట్టిస్తున్నారు. ఎంత అప్రమత్తంగా ఉన్న ఏ మాత్రం కూడా మోసపోతున్నాము అని బాధితులు పసిగట్టకుండా ఉండేలా చాకచక్యంగా సొమ్మును దోచేస్తున్నారు. తాజాగా అలాంటి ఫ్రాడ్ హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది.
ఇటీవలి కాలంలో పార్సిల్ డ్రగ్స్ వచ్చాయంటూ బెదిరింపులకు పాల్పడటం, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లమంటూ డిజిటల్ అరెస్టులు చేసి డబ్బు కాజేయటం లాంటివి పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ తరహా మోసాలు అధికమవడంతో పోలీసులు, ప్రభుత్వం అప్రమైత్తమై అవగాహన చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పబ్లిక్ లో కొంత అవెర్ నెస్ పెరిగింది. దాంతో నేరగాళ్లు కొత్త పంథాను ఎంచుకోవడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
Also Read: PM Surya Ghar Scheme: ఏపీ ప్రజలకు బంపరాఫర్.. ఈ స్కీమ్ తో అధిక లబ్ది మీకే.. డోంట్ మిస్
హైదరాబాద్ లోని ఓ కంపెనీ నుంచి రూ. 1.95 కోట్లు కొట్టేసిన విధానం చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. సదరు కంపెనీలో అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న వ్యక్తికి శనివారం ఉదయం వాట్సాప్ లో ఓ మెసెజ్ వచ్చింది. మెసెజ్ చేసింది ఆ కంపెనీ మేనెజింగ్ డైరెక్టర్. ఆ మెసెజ్ లో ఏముందంటే.. ఒక బ్యాంకు అకౌంట్ నెంబరుతో పాటు.. ‘‘కొత్త ప్రాజెక్టు ఓకే అయిపోయింది కదా. అడ్వాన్స్ అమౌంట్ ను ఆ అకౌంటుకు పంపించు’’ అన్న ఆదేశం ఉంది. యజమాని ఆదేశించాడు కాబట్టి… ‘‘ఓకే బాస్’’ అని రిప్లై ఇచ్చి తర్వాత చెప్పిన పని చేశాడు అకౌంట్స్ ఆఫీసర్. తర్వాత ఆ డబ్బులు పడవలసిన వాళ్ల అకౌంట్లో జమ అయ్యాయి. కానీ జరిగింది మోసమని క్విక్ గా పసిగట్టిన కంపెనీ బాస్..వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు.. దుండగుడు అకౌంట్లో నుంచి డబ్బు డ్రా చేసే లోపు తిరిగి రికవరీ చేయగలిగారు.
అసలు డౌటే రాలేదు..
ఫలానా ఖాతాకు డబ్బులు పంపు అంటూ అకౌంటెంట్ కు శనివారం ఉదయం బాస్ ఫోన్ నుంచి మెసెజ్ వచ్చింది. అతను అన్ని చూసుకున్నాడు. అది అక్షరాల బాస్ నంబరే. వాట్సాప్ డిస్ ప్లే పిక్ కూడా ఆయనదే. డౌట్ పడవలసిన అవసరం లేదు. దాంతో బాస్ చెప్పిన అమౌంట్ ను మద్యాహ్నం 1గంట వరకు పంపించాడు. అయితే ట్రాన్సాక్షన్ పూర్తయి కంపెనీ ఖాతాలో నుంచి డబ్బు వేరే వాళ్ల ఖాతాలో జమ అయినట్లు సదరు కంపెనీ ఎండీకి మెసెజ్ వచ్చింది. వెంటనే అకౌంటెంట్ ను ఆరా తీశాడు. అతను విషయం చెప్పాడు. విషయం అర్థమవడంతో వెంటనే సీసీబీకి కంప్లైంట్ చేశాడు.
గొల్డెన్ అవర్ లో గమనించడమే శ్రీరామరక్ష
ఈ తరహా హైటెక్ మోసాలను బాధితులు అంత త్వరగా పసిగట్టలేకపోవచ్చు. కానీ జరిగిన గంట, రెండు గంటల్లోపే(గొల్డెన్ అవర్) సైబర్ క్రైమ్ పోలీసులకు చెప్తే రికవరీ చేసే ఛాన్సుంటుంది. ఈ విషయాన్ని పోలీసలు ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. అలా వెంటనే అప్రమత్తమైంది కాబట్టి సదరు కంపెనీ కొల్పోయిన సొమ్మును క్షణాల్లో తిరిగి పొందగలిగేది. చదివారుగా.. మీరు కూడా సైబర్ మోసాల పట్ల అలర్ట్ గా ఉండండి. సైబర్ క్రిమినల్స్ తో తస్మాత్.. జాగ్రత్త! ఏదైనా అనుమానం వస్తే 1930కి కాల్ చేయండి.