PM Surya Ghar Scheme
ఆంధ్రప్రదేశ్

PM Surya Ghar Scheme: ఏపీ ప్రజలకు బంపరాఫర్.. ఈ స్కీమ్ తో అధిక లబ్ది మీకే.. డోంట్ మిస్

PM Surya Ghar Scheme: కాలం మారుతోంది. సాంకేతిక పరిజాన వినియోగం అన్ని రంగాల్లోనూ పెరుగుతోంది. దాని ప్రభావం అన్ని రంగాల మీద పడింది. ప్రజలకు మార్పును అంగీకరిస్తున్నారు. ఉదాహరణకి ఈ రోజుల్లో ముసలివాళ్లు కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. అలాగే బ్యాటరీ వాహనాల కొనుగోళ్లు అంతకంతా పెరుగుతోంది. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈవీ(EV)లపై భారీగా రాయితీలను ఇస్తున్నది. అదే రీతిలో విద్యుత్ కు సంబంధించి కూడా ప్రభుత్వాలు అవే యోచన చేస్తున్నాయి. విద్యుత్ వినియోగాన్ని వీలైనంత తగ్గించి, తద్వారా సామాన్యులపై ఆర్థిక భారాన్ని కూడా తగ్గించేందుకు సన్నాహకాలు చేస్తున్నాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా సోలార్ పవర్ వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందుకోసమే ఏడాది క్రితమే పీఎం సూర్యఘర్ పథకాన్ని అమలు చేసింది. మధ్య తరగతి ప్రజలు కూడా భరించగలిగేందుకు గాను భారీగా రాయితీని కూడా ఇస్తున్నది. ఇలాంటి గొప్ప పథకం రాష్ట్ర ప్రజలకు అందాలనే ఉద్దేశంతో ఏపీ సర్కార్ కేంద్రం ఇస్తున్న రాయితీలకు అదనంగా  ఎక్స్ ట్రా సబ్సిడీని ఇస్తున్నది. మరీ.. అలాంటి గొప్ప పథకంలో మీరు లబ్ధిదారులు ఎందుకు కాకుడదు? ఈ సదావకాశాన్ని ఎందుకు వినియోగించుకోకూడదు? అందుకోసమే ఆ స్కీమ్ గురించి, ఆ స్పెషల్ రాయితీల గురించి తెలుసుకుందాం

ఏమిటీ ‘సూర్య ఘర్’ స్కీం?

ఇప్పటివరకు పరిశ్రమలకే పరిమితమైన సోలార్ పవర్ వినియోగాన్ని గృహాలకు కూడా తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర సర్కార్.. ‘ప్రధానమంత్రి సూర్య ఘర్‌ యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇంటి పై కప్పుపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి తద్వారా కరెంట్ బిల్లును తగ్గించుకునే అవకాశాన్ని కల్పించింది. ఎందుకంటే కరెంట్ బిల్లు లేకపోతే కుటుంబ ఆదాయం పెరుగుతుంది. మధ్యతరగతి కుటుంబాలకు అది ఆదాగా మారుతుంది. దేశవ్యాప్తంగా దాదాపు కోటి మంది ప్రజలకు ప్రత్యేక రాయితీని అందించాలని నిర్ణయం తీసుకుంది. కానీ అవగాహన లోపం రీత్యా ప్రజలు దీనిపై ఎక్కువగా ఆసక్తి చూపడం ఆందోళన కలిగిస్తోంది. సూర్య ఘర్ పథకం కోసం నార్త్ ఇండియాలో
ఓ మాదిరిగా అప్లికేషన్లు వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆ సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కార్…వెనుకబడిన వర్గాలైన బీసీలకు ప్రత్యేక రాయితీని ఇవ్వాలని తాజాగా నిర్ణయించింది.

పథకం వివరంగా… 

పీఎం సూర్యఘర్ పథకం పట్ల ఆసక్తిగా ఉన్నవారు.. ముందు ఇంటి మీద సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవాలి. మన వాడకాన్ని బట్టి కెపాసిటి ఆధారంగా ప్లాంటును ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకి.. నెలకు 150 యూనిట్ల లోపు కరెంట్ ను వారికి 1లేదా 2 కిలోవాట్ల ప్లాంట్ ను పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే 150-300 యూనిట్లు చొప్పున వినియోగించే వారు 2-3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ను, 300 యూనిట్ల కంటే ఎక్కువగా వాడేవారు 3 కంటే ఎక్కువ కిలోవాట్ల కెపాసిటి కలిగిన ప్లాంట్లను పెట్టుకోవాల్సి ఉంటుంది.

అయితే, 1 కిలోవాట్‌కు రూ.30వేలు సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. 2 కిలోవాట్లకు రూ. 60 వేలు, 3 కిలోవాట్లకు రూ. 78వేల సబ్సిడీ లభిస్తుంది. అంటే ఓ అంచనా ప్రకారం.. 3 కిలోవాట్ల ప్లాంట్ కు రూ. 1.45 లక్షలు అవుతుంది. దీంట్లో 78వేల రూపాయలు కేంద్రమే భరిస్తుంది. మిగిలింది కట్టాలి. దానికి కూడా ష్యూరిటి లేకుండానే లోన్ తీసుకునే వెసులు బాటును కల్పించింది. అయితే ఏపీ ప్రభుత్వం బీసీలకు 2 కిలోవాట్లకు రూ. 80వేలు సబ్సడీని ఇస్తుంది. అది బెనిఫిట్. దీని ద్వారా వినియోగదారులకు బాగానే లబ్ధి చేకూరనుంది. నెలకి వెయ్యి నుంచి రెండు వెల రూపాయల వరకు ఆదా అవుతుంది.

అప్లై చేసుకొండిలా 
పీఎం సూర్యఘర్‌ పథకానికి అప్లై చేసుకోవాలనుకునే వాళ్లు ముందుగా pmsuryaghar.gov.in పోర్టల్‌లో పేరును రిజిస్టర్‌ చేసుకోవాలి. అందులో కన్జ్యూమర్ నెంబర్ తదితర వివరాలను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. దాని ద్వారా ‘రూఫ్‌టాప్‌ సోలార్‌’ కోసం అప్లయ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత డిస్కమ్(apspdcl) నుంచి మీకు అనుమతి వస్తుంది. ఆ తర్వాత ఇన్ స్టాలేషన్ ప్రక్రియ ఉంటుంది.

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?