నిజమాబాద్ స్వేచ్చ: Nizamabad Crime News: కన్న తల్లిని కాటికి పంపింది ఓ కసాయి కూతురు. భర్తతో కలిసి గొంతు నులిమి హత్య చేసి సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేయబోయి అడ్డంగా దొరికింది. ఆకూతురు భర్తను చితక బాధితే చేసిన ఘోరం ఒప్పుకున్నాడు. ఇంతకి కన్నతల్లిని చంపాల్సిన అవసరం ఆ కూతురికి ఎందుకొచ్చింది? తల్లిని చంపిన ఆ కూతురు ఇద్దరు పిల్లలను అనాథలుగా మారడానికి కారణాలేమిటో తెలుసుకుందాం.
నిజమాబాద్ నగర శివారులోని నాగారంలో దారుణ ఘటన వెలుగు చూసింది. కుటుంబ విషయాల్లో అడ్డోస్తుందని నెపంతో కన్న తల్లిని భర్త సహాయంతో హత్య చేసింది. ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం 300 క్వాటర్స్ కు చెందిన విజయకు ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. విజయ భర్త గతంలోనే మృతిచెందాడు. కుమారుడు మద్యానికి బానిసై తరచూ గొడవ పడుతుండడంతో విజయ తన కూతురు సౌందర్య దగ్గర నాలుగేళ్లుగా ఉంటోంది. తాను కష్టపడి కూతురు, అల్లుడు వారి ఇద్దరు పిల్లలను పోషిస్తుంది.
Also Read: Khammam District: ఆందోళన వద్దు.. ఇబ్బందులు పడవద్దు.. రైతన్నలకు కలెక్టర్ హామీ
తన సంపాదన కావడంతో వృధా ఖర్చులు వద్దని వారించేది విజయ. తరచూ ఇంటి విషయంలో జోక్యం చేసుకోవడంతో కూతురు, అల్లుడికి ఇబ్బందిగా మారింది. ఈ విషయంలో తల్లితో కూతురు తరచూ గొడవ పడేది. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని కూతురు సౌందర్య స్కెచ్ వేసింది. భర్త రమేష్ తో చర్చించింది. భార్య ఒత్తిడి చేయడతో భర్త సైతం అత్త హత్యకు అంగీకరించాడు. ఈనెల 12న అర్ధరాత్రి తన తల్లి గాడ నిద్రలోకి జారుకున్నాక ఆమె ముఖం పై దిండు పెట్టీ ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు.
తరువాత చనిపోయిందో లేదో అనే అనుమానంతో ఆమె గొంతును గట్టిగా నులిమి హత్య చేశారు. మా అమ్మ సహజం మరణంగా నమ్మించేందుకు ప్రయత్నంచేశారు. నిన్నటి వరకు బాగా ఉన్న విజయ ఎలా చనిపోతుందని స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో సంస్థానికులు కుతురు సౌందర్య,అల్లుడు రమేష్ ను నిలదీశారు. స్థానికులు రమేష్ ను చితక బాదారు. దీంతో తామే చంపామని నేరం అంగీకరించాడు. భర్తతో కలిసి తల్లిని హత్య చేసిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది.
Also Read: Hyderabad Crime: మాయగాడు.. మోసగాడు.. పెళ్లి పేరుతో పెద్ద కథే నడిపాడు.. చివరికి?
స్థానికుల పిర్యాదుతో పోలీసులు రంగంలో దిగి విజయ హత్యకు ఉపయోగించిన దిండును స్వాధీనం చేసుకుని పోలీసులు భార్య,భర్తలను అరెస్ట్ చేసి తమ దైన శైలిలో విచారించారు. ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్లే హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు ఐదో టౌన్ పోలీసులు తెలిపారు. కన్న తల్లిని చంపిన సౌందర్య తాను కటకటాలకు వెళ్లి ఇద్దరు పిల్లలను అనాథలుగా మార్చింది.
విజయ హత్యకు ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం ఓ కారణం ఐతే, రెండో కారణం డబ్బు అని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. విజయ వద్ద ఉన్న నగదుతో పాటు ఆమెను వచ్చే బ్యాంక్ లోన్ కోసం హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కొడుకును కాదని కూతురు దగ్గర కు వచ్చిన విజయ ఆ కూతురు చేతిలో విగత జీవిగా మారడంతో స్థానికులు కన్నీటి పర్యతం అయ్యారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు